Samsung Galaxy | శామ్‌సంగ్ గెలాక్సీ F17 5G విడుదల.. ఫుల్ ఫీచర్లతో, ఫ్రెండ్లీ ప్రైస్‌తో!
Samsung Galaxy | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లకు దారి చూపుతున్న శామ్‌సంగ్, తాజాగా సెప్టెంబర్ 11న తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Galaxy F17 5Gను అధికారికంగా విడుదల చేసింది. గెలాక్సీ F17 5G కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. దీని బాడీ సన్నగా ఉన్నప్పటికీ, బలంగా ఉండేలా రూపొందించారు. 6.6-అంగుళాల FHD+ Super AMOLED డిస్ప్లే, విభిన్న కలర్స్, క్లీన్ విజువల్స్‌ను అందిస్తుంది.
#image_title
50MP ప్రైమరీ కెమెరా OIS (Optical Image Stabilization) సపోర్ట్‌తో, హై రిజల్యూషన్ బ్లర్-ఫ్రీ ఫొటోలు తీసేందుకు బాగా పనికొస్తుంది. మాక్రో & అల్ట్రా వైడ్ లెన్స్‌లు ఉన్నాయి. 13MP ఫ్రంట్ కెమెరా ద్వారా సెల్ఫీలకు క్లారిటీ గ్యారంటీ.
గూగుల్ నుంచి వచ్చిన Circle to Search, అలాగే Gemini Live AI వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌ను మరింత ఇంటెలిజెంట్‌గా వాడుకునేందుకు ఇవి సాయం చేస్తాయి. శామ్‌సంగ్ Galaxy F17 5Gలో 5nm ఆధారిత Exynos 1330 ప్రాసెసర్ పని చేస్తోంది.5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో చాలా తక్కువ సమయంలో ఫోన్‌కి ఫుల్ ఛార్జ్ ఇవ్వొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్‌ల్లో కొనుగోలు చేయొచ్చు.
వెర్షన్ ప్రకారం ధరలు ఇలా ఉన్నాయి:
4GB + 128GB – ₹13,999
6GB + 128GB – ₹15,499
8GB + 128GB – ₹16,999