Samsung Galaxy S22 Series : ఆక‌ట్టుకునే స్పెసిఫికేష‌న్స్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 22.. అడ్వాన్స్ డ్ ఫీచ‌ర్స్ ఏంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samsung Galaxy S22 Series : ఆక‌ట్టుకునే స్పెసిఫికేష‌న్స్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 22.. అడ్వాన్స్ డ్ ఫీచ‌ర్స్ ఏంటంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 January 2022,2:00 pm

Samsung Galaxy S22 Series : కొత్త ఏడాదిలో ప‌లు ర‌కాలు ఫోన్స్ వినియోగ‌దారుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఇప్ప‌టికే కొన్ని ఫోన్స్ మార్కెట్ లోకి రాగా, మ‌రి కొన్ని ఫోన్స్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 9న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ‌ఫోన్లు విడుదల కానుండ‌గా, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 , గెలాక్సీ ఎస్2+ , గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్ల కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానున్న ఈ ఫోన్‌ల‌పై అంద‌రిలో ఆస‌క్తి పెరుగుతుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. కీలక స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లలో భారీ ఆదరణ లభించింది.

పవర్‌ఫుల్‌ కెమెరా సపోర్ట్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 నిలిచింది. దీనిని కంటిన్యూ చేస్తూ శాంసంగ్‌ మరిన్ని అద్బుతమైన ఫీచర్స్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రాను శాంసంగ్‌ లాంచ్‌ చేయనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా మొబైల్ 6.8 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తుందని స‌మాచారం. అలాగే దేశాన్ని బట్టి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా సామ్‌సంగ్ ఎక్సినోస్ 2200 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది. 8జీబీ, 12జీబీ ర్యామ్ వేరియంట్లు.. 128జీబీ, 256జీబీ స్టోరేజీ ఆప్షన్లలో రానున్నాయి. బ్యాట‌రీ విష‌యానికి వ‌స్తే 5000ఎంఏహెచ్ ఉంటుంద‌ని, గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్‌ వెనుక 108 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలీఫొటో లెన్స్, 10 మెగాపిక్సెల్ సెకండరీ టెలీఫొటో కెమెరా ఉండనున్నాయని సమాచారం. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22+ మొబైల్ 6.6 ఇంచుల డిస్‌ప్లేతో వస్తుందని సామ్‌మొబైల్ లీక్ చేసింది.

samsung galaxy s22 series ultra leaked specifications

samsung galaxy s22 series ultra leaked specifications

Samsung Galaxy S22 Series : ఆక‌ట్టుకోనున్నఫీచ‌ర్స్

8జీబీ ర్యామ్ ఉండనుండగా 128జీబీ, 256జీబీ స్టోరేజీ ఆప్షన్లలో ఈ ఫోన్ వస్తుందని సమాచారం. ఈ మొబైల్ కూడా దేశాన్ని బట్టి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా ఎక్సినోస్ 2022 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాలతో వస్తుందని సమాచారం. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 10 మెగాపిక్సెల్ టెలీఫొటో సెన్సార్ ఉండనున్నాయి. 4600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంద‌ని స‌మాచారం. చార్జింగ్ విష‌యానికి వ‌స్తే డెమ్కో సర్టిఫికేషన్ ప్రకారం గెలాక్సీ ఎస్22+, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మొబైళ్లు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తాయని తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానున్న‌ ఈ ఫోన్స్ వినియోగ‌దారుల‌కి మెచ్చేలా ఉంటాయ‌నేది స‌మాచారం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది