Samsung Galaxy S22 Series : సామ్ సంగ్ ఎస్22 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి.. ఫీచర్స్, రేట్లు ఇవే..!
Samsung Galaxy S22 Series: మొబైల్ రంగంలో సామ్ సంగ్‌ది సెపరేటు స్టైల్. ఆ కంపెనీ ఫోన్లకు ఉన్నంత డిమాండ్ అంతా ఇంతా కాదు. మధ్య తరగతి నుంచి మొదలు కొంటే ఉన్నత స్థాయి వర్గాల దాకా అందరికీ అనువైన మొబైల్స్ ను ఎప్పటికప్పుడు మార్కెట్ లో ప్రవేశ పెడుతోంది సామ్ సంగ్ కంపెనీ. అయితే ఇప్పుడు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చేశాయి. వీటి కోసం ఎప్పటి నుంచో మొబైల్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. కాగా అయితే ఈ సిరీస్ లో మూడు ఫోన్లను దక్షిణకొరియా కంపెనీ సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చింది.
ఇందులో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22తో పాటుగా ఎస్22 ప్లస్ అలాగే గెలాక్సీ ఎస్22 అల్ట్రా వేరియేషన్లను తీసుకు వచ్చింది సామ్ సంగ్ కంపెనీ. కాగా ఈ మూడు వేరియంట్ల ఫీచర్స్, ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గెలాక్సీ ఎస్22 ఫోన్ లో 8జీబీ ర్యామ్ అలాగే 128జీబీ స్టోరేజీ కూడా ఉంటుంది. దీని ధర 799డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.59,800గా ఉంది. ఇక అలాగే ఎస్22 ప్లస్ రేటు కూడా రూ.999 డాలర్లు ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.74, 800 రూపాయలు ఉంది. దీనికి కూడా 8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ స్టోరేజీ ఉంది.
Samsung Galaxy S22 Series: ఈ నెల 25 నుంచి అమ్మకాలు..
ఇక ఈ రెండు వేరియంట్ల అమ్మకాలను ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్టు సామ్ సంగ్ వెల్లడించింది. వీటి డిస్ ప్లే వచ్చేసి 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో ఉంటాయి. అయితే ఎస్22లో మాత్రం 6.1 ఇంచుల డిస్‌ప్లే ఉంటే.. ఎస్22 ప్లస్ లో మాత్రం 6.6ఇంచుల డిస్‌ప్లే ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. అయితే ఈ రెండు వేరియంట్లకు వెనకాల మూడు కెమెరాల సెటప్ అమర్చి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యుయల్ పిక్సెల్ 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వీటికి అమర్చి ఉన్నాయి. ఎస్22 లో 3700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే.. ఎస్22 ప్లస్ కు మాత్రం 4500ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉన్నాయి.