Sandwich : పెరుగుతో శాండ్విచ్ నోటికి కమ్మగా… కడుపుకి చల్లగా…
Sandwich : పెరుగుతో శాండ్విచ్ మనం ప్రతిరోజు ఎన్నో రకాల బ్రేక్ ఫాస్ట్ చేసి తింటూ ఉంటాము. అయితే పెరుగుతో శాండ్విచ్ కూడా చేసి తింటుంటారు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఆరోగ్యకరమైనది ఎంతో టేస్టీ అలాగే ఎంతో హెల్తీ పెరుగు మన శరీరానికి చలువ చేస్తుంది. పెరుగులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే ఈ పెరుగుతో చేసిన ఐటమ్స్ ను చిన్నపిల్లలకు పెట్టడం వలన పిల్లల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే డైజేషన్ కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఇలాంటి పెరుగుతో మనం ఇప్పుడు శాండ్విచ్ చేసుకుందాం ఈజీగా..
ఈ శాండ్విచ్ కు కావలసిన పదార్థాలు: పెరుగు, బ్రెడ్ స్లైసెస్, క్యారెట్ లు, షుగర్, సాల్ట్, క్యాబేజ్, క్యాప్సికం, స్వీట్ కార్న్ గింజలు,మిరియాలు, నెయ్యి మొదలెగినవి. దీని తయారీ విధానం: ఒక క్లాత్ తీసుకొని దానిని జల్లెడ పై పరిచి దాన్లో ఒక కప్పు పెరుగు వేసి మూటలాగా కట్టి 15 నిమిషాల వరకు ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న వాటర్ అంతా దిగిపోయి పెరుగు గట్టి పడుతుంది. తర్వాత ఆ పెరుగును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా కలిపి దానిలోకి స్వీట్ కార్న్ గింజలు ఉడకబెట్టినవి రెండు స్పూన్లు, అరకప్పు క్యాప్సికం ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు సన్నగా తరిగినవి.
అరకప్పు క్యాప్సికం ముక్కలు, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం షుగర్, కొంచెం మిరియాల పొడి, వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నాలుగు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకొని వాటి సైడ్లు కట్ చేసి, బ్రెడ్ పైన మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టి దానిపై ఇంకొక బ్రెడ్ నుఉంచి దానిని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇదొక రకం ఇంకొకటి బ్రెడ్ ముందుగా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత దానిపై మనం ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని పెట్టుకోవాలి. తర్వాత దానిపై బ్రెడ్ ఉంచి దాన్ని కూడా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. అంతే పెరుగుతో ఎంతో ఈజీగా శాండ్విచ్ రెడీ. ఈ శాండ్విచ్ వేడివేడిగా, చల్ల చల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది.