Sachin Tendulkar | సచిన్‌కి కాబోయే కోడలు ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, అతని ఆటలతో కాకుండా ఇప్పుడు ప్రేమలో విజయాన్ని అందుకున్నాడు. సానియా చందోక్ అనే యువ వ్యాపారవేత్తతో అతను నిశ్చితార్థం చేసుకున్న వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అర్జున్ – సానియా పరిచయం అర్జున్ సోదరి సారా టెండూల్కర్ ద్వారా మొదలైంది. సానియా, సారా బెస్ట్ ఫ్రెండ్స్. అదే చక్కని పరిచయానికి మార్గం అయింది.
పెద్ద కుటుంబమే..
#image_title
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన సానియా చందోక్, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినా తన సొంత గుర్తింపు కోసం ప్రయత్నించింది. తనకు అత్యంత ఇష్టమైన విషయమైన పెంపుడు జంతువుల సేవను వ్యాపారంగా మార్చింది. ముంబైలో స్థాపించిన Mr. Paws Pet Spa ఇప్పుడు లగ్జరీ పెట్ వెల్‌నెస్ బ్రాండ్‌గా వెలుగుతోంది. ఏడాదికి ₹90 లక్షల ఆదాయం, రెండు బ్రాంచ్‌లతో ఎదుగుతోంది.
సానియా కుటుంబం ముంబై వ్యాపార వర్గాల్లో పెద్దదిగా పేరు పొందింది. ఆమె తాత రవి ఘాయ్ – బాస్కిన్-రాబిన్స్ ఇండియా, బ్రూక్లిన్ క్రీమరీ, ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ వంటి భారీ బ్రాండ్‌లను నడిపే Gravis Group అధినేత. 2023–24లో గ్రూప్ టర్నోవర్ ₹624 కోట్లు దాటింది. అయితే, ఆమె తండ్రి గౌరవ్ ఘాయ్, రవి ఘాయ్ మధ్య కొన్ని వ్యక్తిగత విభేదాలున్నా, సానియా ఆ విషయాలపై దృష్టి పెట్టకుండా తన బిజినెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. 2025 ఆగస్టు 13న ముంబైలో ఇంటిమేట్ సెట్ప్‌లో, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ నిశ్చితార్థ వేడుక చుట్టూ పెద్దగా హడావుడి లేకపోయినా, వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.