SBI Asha Scholarship : ఎస్‌బీఐఎఫ్ పేద విద్యార్థులకు 7.5 లక్షల వరకు స్కాలర్‌షిప్…!
ప్రధానాంశాలు:
SBI Asha Scholarship : ఎస్‌బీఐఎఫ్ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024
SBI Asha Scholarship : వేలకు వేలు ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్ లో చదివించినా సరే కొంతమందికి చదువు రాదు. కానీ కొంతమంది మాత్రం వారు చదివేది సర్కార్ స్కూల్ లో అయినా సరే మంచి ప్రతిభ చూపిస్తారు. అలాంటి వారు పై చదువులు చదువుకోవాలంటే కొంత ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం పడుతుంది. ప్రతి గల పేద విద్యార్ధులకు చేయూత అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తాయి. వారికి కావాల్సిన విద్యను ప్రోత్సహించేందుకు అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. 6 వర తరగతి నుంచి పీజీ వరకు విద్యార్ధులను సెలెక్ట్ చేసి వారి చదువుకి కావాల్సిన ఆర్ధిక సాయాన్ని అందిస్తారు.
ఈ పథకం కొంద స్టూడెంట్స్ కు 15 వేల నుంచి 7.5 లక్షల దాకా స్కాలర్ షిప్ అందిస్తారు. అర్హులైన విద్యార్ధులు అక్టోబర్ 1లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
SBI Asha Scholarship స్కాలర్ షిప్ వివరాలు
ఎస్‌బీఐఎఫ్ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024 కోసం కావాల్సిన అర్హతలు..
6 నుంచి 12వ తరగతి వరకు డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలో చదివే విద్యార్థులు ఎవరైనా సరే ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు చేయొచ్చు.
లాస్ట్ అకడమిక్ ఇయర్ విద్యార్థులు కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.
ఎవరైతే దరఖాస్తు దారులు ఉంటారో వారి కుటుంబ ఆదాయం 3 లక్షలు రూపాయలు మించకూడదు.
6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలు.
అండర్ గ్రాడ్యుయేట్ కోసం 50,000 రూపాయలు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం 70,000 రూపాయలు.
ఐఐటీ విద్యార్ధుల కోసం 2 లక్షలు రూపాయలు
ఐఐఎం (ఎంబీఏ/ పీజీడీఎం) విద్యార్థులకు 7.50 లక్షలు రూపాయలు.