Self Employment : ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. నిజానికి డబ్బు అనేది మనిషికి అవసరం. అది లేకుంటే పూట గడవదు. జేబుల్లో డబ్బు ఉంటేనే ఇవాళ రేపు విలువ. లేదంటే ఎవ్వరూ పట్టించుకోరు. డబ్బు కావాలంటే ఏదో ఒక పని చేయాలి. మన దేశంలో చాలామంది ఉద్యోగం వైపే మొగ్గు చూపుతారు. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలి.. అనే కాన్సెప్ట్ తో ఉన్నవాళ్లు చాలామంది. కానీ.. చాలామందికి తెలియని ఒక నిజం ఏంటంటే.. డబ్బు సంపాదించాలంటే చేయాల్సింది ఉద్యోగం కాదు పని. అవును.. నీకు నచ్చిన రంగం ఏంటి? నీకు వచ్చిన పని ఏంటి? ఆ పనిలో నువ్వు నిష్ణాతుడివైతే.. ఆ పనే నీకు డబ్బులు తెచ్చి పెడుతుంది.
డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే ఉండాల్సిన అవసరం లేదు. చదువు కంపల్సరీ కానే కాదు. కావాల్సింది స్కిల్, పని. పని చేసే సత్తా. అవి ఉంటే.. డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది.
అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు ఎక్కువగా పనులు దొరకవు. ఏదో ఒక పని చేసుకొని బతుకుదామన్నా.. పనులుండవు. అటువంటి వాళ్ల కోసం కొన్ని మంచి బిజినెస్ ఐడియాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే ఉత్తమమైన స్వయం ఉపాధి వ్యాపారాలు ఏంటో తెలుసా?
పాల వ్యాపారం.. అనే సరికి చాలామంది చిన్న చూపు చూస్తారు కానీ.. పాల వ్యాపారంలో ఉన్న లాభాలు ఎక్కడా ఉండవు. ప్రస్తుతం పాలకు ఎంత గిరాకీ ఉందో అందరికీ తెలుసు. 100 రూపాయలు పెట్టినా.. స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. ఎక్కడ చూసినా కల్తీ పాలే. అందుకే.. స్వచ్ఛమైన పాలను వినియోగదారులకు అందించగలిగితే.. పాల వ్యాపారం సక్సెస్ అయినట్టే లెక్క.
పాల వ్యాపారం చేయడానికి ఒక్క బర్రె లేదా ఆవు ఉన్నా చాలు. ఒకవేళ పెట్టుబడి ఎక్కువ పెట్టడానికి సిద్ధంగా ఉంటే.. ఓ మూడు నాలుగు ఆవులు, బర్రెలను కొనుక్కొని వెంటనే పాల వ్యాపారం ప్రారంభించవచ్చు. రోజుకు కనీసం 10 లీటర్ల పాలు వచ్చినా.. కనీసం వెయ్యి రూపాయల వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు.
ప్రస్తుతం నాన్ వెజ్ కు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగని వాళ్లు కోకొల్లలు. రోజురోజుకూ నాన్ వెజ్ కు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. ఈనేపథ్యంలో కోళ్ల వ్యాపారం చాలామంచి ఐడియా.
తక్కువ ఖర్చుతో కోళ్లను పెంచుకొని.. వాటిని, వాటి గుడ్లను మార్కెట్ లో అమ్ముకుంటే చాలా లాభాలు గడించవచ్చు. వీటి నిర్వహణ వ్యయం కూడా చాలా తక్కువ. కోళ్ల షెడ్డు, కోడి పిల్లలు, మేత.. ఇవి ఉంటే చాలు.. వెంటనే కోళ్ల బిజినెస్ ను స్టార్ట్ చేయొచ్చు.
నాన్ వెజ్ తో పాటు చేపలకు కూడా నేడు మంచి గిరాకీ ఉంది. కొంచెం ప్లేస్ ఉంటే చాలు.. వెంటనే చేపల బిజినెస్ ను స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతం చేపలను తినే వాళ్లు చాలా ఎక్కువయ్యారు. అందుకే.. చేపలను పెంచి వాటిని మార్కెట్ లో అమ్మితే లాభాలే లాభాలు. కాకపోతే.. చేపలను పెంచడం కోసం కొద్ది పాటి స్థలం ఉండాలి. నీటి వసతి ఉండాలి. అంతే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.