Sadha : ఫుల్ బిజీగా ఉండే సదా.. సడెన్ గా అవకాశాలు లేక ఎందుకు ఇండస్ట్రీని వదిలేసింది?
Sadha : నడుమే ఉయ్యాలా? నడకే జంపాలా? సరుకే ఊగేలా.. తకడిదంతాలా? అనే పాట గుర్తుందా? లేదంటే.. వెళ్లవయ్యా వెళ్లూ… అనే డైలాగ్ గుర్తుందా మీకు? అవును.. మనం మాట్లాడుకునేది జయం హీరోయిన్ సదా గురించే. జయం సినిమా చూసి సదా ప్రేమలో పడిపోయారు కుర్రకారు అంతా. అప్పట్లో లంగావోణి వేసి తను చేసిన హంగామా మామూలుగా లేదు. అందుకే ఇప్పటికీ కుర్రకారు సదాను ఆరాధిస్తున్నారు. అయితే.. కొన్నేళ్ల వరకు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సదా.. సడెన్ గా వెండి తెరకు ఎందుకు దూరమైంది? తనకు అవకాశాలు రాలేదా? లేదా.. తనే అవకాశాలకు వద్దనుకుందా? అసలు సడెన్ గా సదా.. వెండి తెర, బుల్లితెర నుంచి అదృశ్యం కావడానికి రీజన్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం రండి.

senior actress sadha in alitho saradaga show
సదా తాజాగా.. ఆలీతో సరదాగా అనే షోలో గెస్ట్ గా వెళ్లింది. ఆలీతో సరదాగా షో అంటేనే.. సీనియర్ కమెడియన్ ఆలీతో కలిసి చేసే షో. ఆయన షోకు ఎవ్వరు వెళ్లినా వాళ్లు తమ సినీ జీవితం, పర్సనల్ జీవితం అన్నింటి గురించి చెప్పాల్సిందే. వాళ్లు చెప్పకున్నా.. ఎలాగోలా ఆలీ వాళ్లతో చెప్పిస్తారు. తాజాగా షోలో పార్టిసిపేట్ చేసిన సదా కూడా తన వ్యక్తిగత జీవితం, తన సినిమా జీవితం గురించి ఆలీతో పంచుకుంది.

senior actress sadha in alitho saradaga show
Sadha : సడెన్ గా సదాకు అవకాశాలు ఎందుకు తగ్గాయి?
నిజానికి.. సదా చాలా హిట్ సినిమాల్లో నటించింది. తను నటించిన మొదటి సినిమా జయం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే.. అపరిచితుడు కూడా సూపర్ డూపర్ హిట్. ఇంకా.. చాలా హిట్ సినిమాల్లో నటించిన సదా.. ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు చేరుకుంది. అయితే.. ఆ తర్వాత సదాకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. ఎంతో బిజీగా ఉండే సదా.. ఎందుకు అదే స్థాయిలో అవకాశాలను చేజిక్కించుకోలేకపోయింది.. అంటూ ఆలీ తనను అడగగా.. వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది సదా. తన లోపల ఏదో దాగి ఉంది. దాన్ని గుర్తు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సదా.

senior actress sadha in alitho saradaga show
అంటే.. తనకు అవకాశాలు రాకుండా ఎవరైనా చేశారా? లేక ఎవరైనా తనను అవమాన పరిచారా? అనే విషయం తెలియదు కానీ.. తను మాత్రం విపరీతంగా ఏడ్చేసింది. తాజాగా విడుదలైన ఆలీతో సరదాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సదా.. చెప్పిన విషయాలు ఇవి. బహుశా.. ఫుల్ ఎపిసోడ్ లో తనకు ఎందుకు అవకాశాలు రాలేదో.. చెప్పే వీడియో ఉంటుంది కావచ్చు. ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేస్తే కానీ అసలు విషయం తెలియదు.
