
Shakila : నా గదిలోకి వస్తే నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇస్తా.. అల్లరి నరేష్ తండ్రి పై షకీలా ఆరోపణలు...!
Shakila : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా షకీలా కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని ఓపెన్ గా చెప్పారు. ఇటీవలే తమిళ్ బిగ్ బాస్ షో వేదికగా నటి విచిత్ర చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. తమిళ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న విచిత్ర టాలీవుడ్ స్టార్ హీరో తనను గదికి రమ్మన్నాడని చెప్పారు. ఆ హీరో రోజు త్రాగి వచ్చి నా రూమ్ డోర్ కొట్టేవాడు. హోటల్ సిబ్బంది సహకరించడంతో నేను రోజుకు ఒక రూమ్ మారే దాన్ని. నేను అతడికి లొంగలేదని మూవీ సెట్స్ లో నా చెంప పగలకొట్టాడని, ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోలేదని అన్నారు.
ఈ లైంగిక వేధింపుల కారణంగా నేను సినిమాలకు దూరమయ్యానని విచిత్ర ఆరోపించారు. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పలేదు. అయితే విచిత్ర ఇచ్చిన సమాచారం ఆధారంగా అది బాలకృష్ణ అనే వాదన తెరపైకి వచ్చింది. భలేవాడివి బాసు అనే సినిమాలో బాలకృష్ణతో విచిత్ర నటించారు . ఆ మూవీ సెట్స్ లోనే బాలకృష్ణ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియా టాక్. అయితే విచిత్రకు నటి షకీలా మద్దతుగా నిలిచారు. విచిత్ర ఆ హీరో పేరు ధైర్యంగా చెప్పాల్సింది అని అన్నారు. విచిత్ర, నేను ఫ్రెండ్స్. కలిసి కొన్ని సినిమాలలో నటించాం అని షకీలా అన్నారు. అలాగే షకీలా కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
దివంగత దర్శకుడు, అల్లరి నరేష్ తండ్రి అయిన ఈవీవీ సత్యనారాయణ తనను కమిట్మెంట్ అడిగాడని ఆమె ఓపెన్ అయ్యారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఒక సినిమాలో నేను నటించానని, ఆయన నన్ను అడ్జస్ట్ అవ్వమని అడిగారని, నువ్వు నా గదికి వస్తే నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇస్తా అన్నారని షకీలా అన్నారు. ఈ సినిమాకు నాకు పేమెంట్ వచ్చేసింది. మీ నెక్స్ట్ మూవీలో నాకు ఆఫర్ వద్దు. నేను అడ్జస్ట్ కాను అని చెప్పేసాను అని షకీలా అన్నారు. ఎవరు ఎక్కడికి వచ్చి పిలిచిన నేను ఇదే చెబుతాను అని షకీలా చెప్పుకొచ్చారు. దీంతో షకీలా చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో చర్చకు దారి తీసాయి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.