
#image_title
Bus Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ వోల్వో బస్సు, వేగంగా వచ్చిన ఒక బైక్‌ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
#image_title
బైక్ రైడర్ శివశంకర్ మృతి
పోలీసుల ప్రకారం, బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని సుమారు 300 మీటర్లు లాగుకుంటూ వెళ్లి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలిపారు. మంటలు అంత వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులకు బయటపడే అవకాశం లేకుండా పోయింది. బస్సు పూర్తిగా దగ్ధమై, సీట్లకు అతుక్కుపోయిన మృతదేహాలు కనిపించిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ఈ ప్రమాదంలో మరణించిన బైక్ రైడర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసేవారని, ప్రమాదం జరిగిన సమయంలో డోన్ నుంచి ఇంటికి వస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.శివశంకర్ మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. “తాను బతికి ఉండగానే బిడ్డ ఇలా కాలిపోవడం ఏంటి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
Curd | పెరుగు మన ఆహారంలో ఓ ముఖ్యమైన భాగం. ఇది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు…
Apple | రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్న నానుడి కేవలం మాట కాదు,…
Liquor | నేటి కాలంలో చాలామందికి ఆకలిగా ఉన్నప్పుడే మద్యం తాగే అలవాటు ఉంది. ఇది సరదాగా అనిపించినా, శరీరానికి ప్రమాదకరమని…
Chanakya | మహానీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విలువైన సూత్రాలను…
This website uses cookies.