Bus Accident | బ‌స్సు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వ్య‌క్తి ఇత‌నే.. గుండె విలపించేలా రోదిస్తున్న తల్లి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bus Accident | బ‌స్సు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వ్య‌క్తి ఇత‌నే.. గుండె విలపించేలా రోదిస్తున్న తల్లి

 Authored By sandeep | The Telugu News | Updated on :24 October 2025,1:00 pm

Bus Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ వోల్వో బస్సు, వేగంగా వచ్చిన ఒక బైక్‌ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.

#image_title

బైక్ రైడర్ శివశంకర్ మృతి

పోలీసుల ప్రకారం, బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని సుమారు 300 మీటర్లు లాగుకుంటూ వెళ్లి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలిపారు. మంటలు అంత వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులకు బయటపడే అవకాశం లేకుండా పోయింది. బస్సు పూర్తిగా దగ్ధమై, సీట్లకు అతుక్కుపోయిన మృతదేహాలు కనిపించిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

ఈ ప్రమాదంలో మ‌ర‌ణించిన బైక్ రైడర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసేవారని, ప్రమాదం జరిగిన సమయంలో డోన్ నుంచి ఇంటికి వస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.శివశంకర్ మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. “తాను బతికి ఉండగానే బిడ్డ ఇలా కాలిపోవడం ఏంటి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది