Shoaib Malik : ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏ మ్యాచ్‌లోను కప్ కొట్టలేకపోతున్నారు. పసికూన కంటే హీనంగా ఆడుతూ ఇంటా బయట విమర్శలు మూటగట్టుకుంది.. సొంత కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కూడా పాక్ టీమ్‌లో మూడ్నాలుగు గ్రూపులు ఉన్నాయి, ఫిట్నెస్ స్టాండర్డ్స్‌ను ఎవరూ పాటిండం లేదంటూ విమర్శలకు దిగడం హాట్ టాపిక్ అయింది. ఒక్కో పరిణామాం పాకిస్తాన్ ప్రతిష్టని దిగజారుస్తుంది. అయితే వచ్చే ఏడాది అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనున్న ఆ దేశ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీపై కూడా మాలిక్ స్పందించాడు.
పాకిస్థానీలు ప్రేమగల మనుషులని, భారత జట్టును అపూర్వంగా స్వాగతిస్తారని అన్నాడు. ‘దేశాల మధ్య వివాదాలు ఉంటే ప్రత్యేకంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేతప్ప ఆటల్లోకి రాజకీయాలను తేవొద్దు. నిరుడు పాక్ జట్టు భారత్‌కు వెళ్లింది. ఇప్పుడు టీమిండియాకు పాక్‌కు వచ్చే అవకాశం వచ్చింది. నా దృష్టిలో ఇప్పుడు భారత జట్టులోని చాలామందికి పాక్‌లో ఆడిన అనుభవం లేదు. కచ్చితంగా టీమిండియా మా దేశం వస్తుందని ఆశిస్తున్నా’ అని మాలిక్ వెల్లడించాడు. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ పాక్ తరఫున 2021 నవంబర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు.
తాజాగా టీ20 ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ఇక మీదట చచ్చినా పాకిస్థాన్‌కు ఆడనని స్పష్టం చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందని, ఇన్నాళ్లూ ఆడినందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నాడు మాలిక్. పాకిస్థాన్‌కు ఆడాలనే కోరిక, ఆసక్తి తనకు లేవన్నాడు.నేను ఆల్రెడీ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యా. ఇప్పుడు మిగిలిన టీ20 క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెబుతున్నా. ఇక మీదట నాకు అవకాశం దొరికిన ప్రతి లీగ్‌లోనూ అదరగొట్టేందుకు ప్రయత్నిస్తా’ అని మాలిక్ స్పష్టం చేశాడు. తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో మాలిక్ 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. జట్టులో చోటు కోల్పోయిన మాలిక్ పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇతర ఇంటర్నేషనల్ లీగ్స్‌లో ఆడుతున్నాడు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.