Shoaib Malik : రోజురోజుకి దిగ‌జారుతున్న పాకిస్తాన్ ప్ర‌తిష్ట‌.. ఇక మా దేశానికి చ‌చ్చినా ఆడ‌న‌న్న స్టార్ క్రికెట‌ర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shoaib Malik : రోజురోజుకి దిగ‌జారుతున్న పాకిస్తాన్ ప్ర‌తిష్ట‌.. ఇక మా దేశానికి చ‌చ్చినా ఆడ‌న‌న్న స్టార్ క్రికెట‌ర్..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Shoaib Malik : రోజురోజుకి దిగ‌జారుతున్న పాకిస్తాన్ ప్ర‌తిష్ట‌.. ఇక మా దేశానికి చ‌చ్చినా ఆడ‌న‌న్న స్టార్ క్రికెట‌ర్..!

Shoaib Malik : ప్ర‌స్తుతం పాకిస్తాన్ జ‌ట్టు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఏ మ్యాచ్‌లోను క‌ప్ కొట్ట‌లేక‌పోతున్నారు. పసికూన కంటే హీనంగా ఆడుతూ ఇంటా బయట విమర్శలు మూటగట్టుకుంది.. సొంత కోచ్​ గ్యారీ కిర్​స్టెన్ కూడా పాక్​ టీమ్​లో మూడ్నాలుగు గ్రూపులు ఉన్నాయి, ఫిట్​నెస్ స్టాండర్డ్స్​ను ఎవరూ పాటిండం లేదంటూ విమర్శలకు దిగడం హాట్ టాపిక్ అయింది. ఒక్కో ప‌రిణామాం పాకిస్తాన్ ప్ర‌తిష్ట‌ని దిగ‌జారుస్తుంది. అయితే వచ్చే ఏడాది అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనున్న ఆ దేశ క్రికెట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. వ‌చ్చే ఏడాది సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగ‌నున్న‌ చాంపియ‌న్స్ ట్రోఫీపై కూడా మాలిక్ స్పందించాడు.

Shoaib Malik పాక్ కోసం ఆడ‌ను..

పాకిస్థానీలు ప్రేమ‌గ‌ల మ‌నుషుల‌ని, భార‌త జ‌ట్టును అపూర్వంగా స్వాగతిస్తార‌ని అన్నాడు. ‘దేశాల మ‌ధ్య వివాదాలు ఉంటే ప్ర‌త్యేకంగా మాట్లాడుకొని ప‌రిష్క‌రించుకోవాలి. అంతేత‌ప్ప ఆట‌ల్లోకి రాజ‌కీయాల‌ను తేవొద్దు. నిరుడు పాక్ జ‌ట్టు భార‌త్‌కు వెళ్లింది. ఇప్పుడు టీమిండియాకు పాక్‌కు వ‌చ్చే అవకాశం వ‌చ్చింది. నా దృష్టిలో ఇప్పుడు భార‌త జ‌ట్టులోని చాలామందికి పాక్‌లో ఆడిన అనుభ‌వం లేదు. క‌చ్చితంగా టీమిండియా మా దేశం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నా’ అని మాలిక్ వెల్లడించాడు. ఈ వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ పాక్ త‌ర‌ఫున 2021 న‌వంబ‌ర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడేశాడు.

Shoaib Malik రోజురోజుకి దిగ‌జారుతున్న పాకిస్తాన్ ప్ర‌తిష్ట‌ ఇక మా దేశానికి చ‌చ్చినా ఆడ‌న‌న్న స్టార్ క్రికెట‌ర్

Shoaib Malik : రోజురోజుకి దిగ‌జారుతున్న పాకిస్తాన్ ప్ర‌తిష్ట‌.. ఇక మా దేశానికి చ‌చ్చినా ఆడ‌న‌న్న స్టార్ క్రికెట‌ర్..!

తాజాగా టీ20 ఫార్మాట్​కు కూడా గుడ్​బై చెప్పేశాడు. ఇక మీదట చచ్చినా పాకిస్థాన్​కు ఆడనని స్పష్టం చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందని, ఇన్నాళ్లూ ఆడినందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నాడు మాలిక్. పాకిస్థాన్​కు ఆడాలనే కోరిక, ఆసక్తి తనకు లేవన్నాడు.నేను ఆల్రెడీ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యా. ఇప్పుడు మిగిలిన టీ20 క్రికెట్​కు కూడా గుడ్​బై చెబుతున్నా. ఇక మీదట నాకు అవకాశం దొరికిన ప్రతి లీగ్​లోనూ అదరగొట్టేందుకు ప్రయత్నిస్తా’ అని మాలిక్ స్పష్టం చేశాడు. త‌న సుదీర్ఘ అంత‌ర్జాతీయ కెరీర్‌లో మాలిక్ 35 టెస్టులు, 287 వ‌న్డేలు, 124 టీ20లు ఆడాడు. జ‌ట్టులో చోటు కోల్పోయిన మాలిక్ పాకిస్థాన్ సూప‌ర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్, ఇత‌ర ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్స్‌లో ఆడుతున్నాడు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది