భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తల స్నానం చేయాలా? వద్దా..?
ఒకప్పటి ఆచారాలు ప్రస్తుత తరానికి చాలా వరకు మరిగిపోయాయి. గజిబిజి పరుగుల జీవితంతో చాలామంది తమకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నారు. ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్యాభర్తలకు ఎవరు చెప్పక.. తప్పులు చేస్తున్నారు. ఈ తప్పులతో ఒకపక్క ఆర్థికంగా మరో పక్క మానసికంగా… కొని నష్టాలకు దారితీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్త వైవాహిక జీవితంలో… కలిసిన తర్వాత కొన్ని చేయాల్సినవి మరియు చేయకూడని పనులు గురించి వీడియో మీకోసం. మేటర్ లోకి వెళ్తే నిత్యము పూజా విధానము కలిగిన ఆడవాళ్లు…
భర్తతో కలిసిన తర్వాత రోజు ఆడవాళ్లు తల స్నానం చేయకపోయినా పర్వాలేదట. కానీ మగవారు మాత్రం కచ్చితంగా తలస్నానం చేసి పూజ గదిలోకి రావాలంట. ఆడవారి నెత్తిన పాపిడినా నిత్యము కుంకుమ పెట్టుకుంటారు. దీంతో వాళ్ళ నెత్తిపై గంగమ్మ కొలువై ఉంటుంది. అందువల్లే వాళ్లు తలస్నానం చేయకపోయినా పరవాలేదంట. అయితే భగవంతుడి పటాలు మరియు పూజ గదిలో ఉండే సామాగ్రిని ముట్టుకోకూడదు అంట. కేవలం దీపారాధన వరకైతే తలస్నానం చేయకపోయినా మామూలు స్నానంతో కొనసాగించుకోవచ్చు. అయితే రాత్రి భార్యాభర్తలు కలిసాక
లేచిన వెంటనే ఇల్లాలు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలంట. అలా కాకుండా ఆ మైలుతో.. ఇల్లు మొత్తం తిరగకూడదట. స్నానం చేసిన తర్వాతే పూజ పనులు చేయాలంట. ఇంకా ప్రత్యేకమైన పూజల విషయంలో తప్పకుండా తలస్నానాలు చేయాలంట. మాంసాహారం తిన్న తర్వాత రోజు నిత్యపూజ అయితే తలస్నానం చేయకపోయినా పర్వాలేదట. కానీ ప్రత్యేకమైన పూజ అయితే కచ్చితంగా తలస్నానం చేసి ముందుగా… ఎవరికివారు తమపై పసుపు నీళ్లు జల్లుకుని… ఇల్లంత పసుపు నీళ్లు జల్లిన తర్వాతే పూజ గదిలోకి ఎంట్రీ ఇవ్వాలట.