Singareni Job : నిరుద్యోగులకు శుభవార్త .. సింగరేణిలో భారీగా ఉద్యోగాల భర్తీ ..!
Singareni Job : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. సింగరేణిలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ వెల్లడించారు. ఇటీవల తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సంస్థ సీఎండీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను రెడీ చేయాలని భట్టి విక్రమార్క సీఎండి బలరాం నాయక్ ను ఆదేశించారు.
ఈ క్రమంలోనూ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్ వెలవడున్నట్లు తెలుస్తోంది. మొత్తం 485 ఉద్యోగాలకు దరఖాస్తులను సింగరేణి ఆహ్వానించనుంది. ఈ రిక్రూట్మెంట్ తో పాటు సంస్థలు కారుణ్య నియామకాలను చేపట్టాలని ఈ సంవత్సరంలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఇక సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగమైన కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇటీవల సింగరేణి సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కల్పించడంపై అవగాహనపై ఒప్పంద కుదుర్చుకుంది.
దీంతో కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించనున్నారు. దీంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించినట్లు అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ఈనెల 26వ తేదీన ఆవిష్కరణకు ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఇక సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్రకటించనున్నారు ఈ క్రమంలోనే సింగరేణి నుంచి భారీగా ఉద్యోగాలు భర్తీ చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
This website uses cookies.