Moto Edge 30 : సరికొత్త ఫీచర్స్ తో మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్.. త్వరలో అతి సన్నని మొబైల్ గా లాంచ్
Moto Edge 30 : ప్రముఖ కంపెనీ మోటరోలా నుంచి మరో ఫోన్ విడుదల కానుంది. సరికొత్త ఫీచర్స్, స్పెసిఫికేషన్లతో మోటో ఎడ్జ్ 30 ఇండియాలో లాంచ్ కానుంది. ఈ నెల(మే) 19న సేల్స్ స్టార్ట్ కానున్నాయి. 144 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన ఫుల్ హెచ్ డీ 10 బిట్ పోలెడ్ డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G+ 5జీ ప్రాసెసర్. 6.55 ఇంచెస్ డిస్ ప్లే, బ్యాటరీ కెపాసిటీ 4020 ఎంఏహెచ్, 33 వాట్స్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
అయితే కేవలం 6.9mm మందంతో మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అత్యంత సన్నని 5జీ ఫోన్ గా రాబోతుంది.కాగా ఈ ఫోన్ ఈ నెల 19 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనుంది. అలాగే ఎచ్ డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో తక్షణ డిస్కౌంట్ రూ. 2000 పొందే అవకాశం ఉంది. కాగా మోట్ హెడ్జ్ 30 మొబైల్ 6 జీబీ, 128 జీబీ ర్యామ్, 8 జీబీ, 256 జీబీ ర్యామ్ లలో రెండు కలర్స్ లలో అందుబాటులోకి తెచ్చింది. ఇక కెమెరా ఫీచర్స్ రియర్ కెమెరా 50 ఎంపీ+50 ఎంపీ+16 ఎంపీ+2 ఎంపీ ఉండగా.. ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ గా ఉన్నాయి.ఈ మోటో ఎడ్జ్ డుయెల్ సిమ్, 2జీ,3జీ,4జీ,5జీ నెట్ వర్క్ లలో పని చేస్తుంది.
అలాగే ఈ మొబైల్ తో హ్యాండ్ సెట్, చార్జర్, యూఎస్బీ కేబుల్, బ్యాక్ ప్రొటెక్టివ్ కవర్, సిమ్ టూల్ అధనంగా అందిచబడతాయి. కాగా ఈ కామర్స దిగ్గజం ఫిప్ కార్ట్ లో ఈ నెల 19న 12 గంటల నుంచి సేల్స్ స్టార్ట్ అవనుండగా..6 జీబీ గ్రే కలర్ ఫోన్ ధర రూ.27,999 కే లభించనుంది. అలాగే ఎచ్ డీ ఎఫ్సీ క్రెడిట్ కార్డుపై రూ. 2000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. అలాగే సిటీ డెబిట్, క్రెడిట్ కార్డలతో 15 వందల వరకు క్యాష్ బ్యాక్ రానుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ రానుంది.