Smart Phones : 25 వేల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే..

Authored By mallesh | The Telugu News | Published on: February 8, 2022, 6:10 pm

Smart phones : ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగమైపోయింది. దాదాపుగా సెల్ ఫోన్ లేని మనిషి మనకు కనిపించడు. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ఇందులో కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. అవి కూడా సామాన్యుడికి అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. అందుకే వీటిని కొనుగోలు చేసేందుకు యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక ఇప్పటికే ఫోన్ వాడుతున్న వారు మరిన్ని కొత్త ఫీచర్స్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారు. అందులో మీరు ఒకరైతే..

ఈ న్యూస్ మీ కోసమే.. దాదాపు రూ.25 వేలలోపే మంచి స్మార్ట్ ఫోన్లను పలు కంపెనీలు అందిస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం.రియల్ మీలో కొత్తగా జీటీ 5జీ మొబైల్ రిలీజ్ అయింది. ఈ ఫోన్ 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ AMOLED డిస్​ప్లే కలిగి ఉంది. ఈ డిస్​ప్లే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. క్వాల్​కామ్​స్నాప్​డ్రాగన్​888 ఎస్ఓసీ ప్రాసెసర్‌ ఆధారంగా వర్క్ చేస్తుంది. దీని వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్​ఉంటుంది. దీని ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

smartphone under in 25 thousand onley

smartphone under in 25 thousand onley

Smart phones : కొత్తగా వచ్చినవి ఇవే…

షియోమి 11ఐ ఫోన్ 6.67 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఇది మీడియాటెక్​ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో వర్క్ చేస్తుంది. ఈ ఫోన్​ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్​స్టోరేజ్​కలిగి ఉంటుంది. ట్రిపుల్​రియర్ కెమెరా 108 మెగాపిక్సెల్ కాగా, ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంది. వీటితో పాటు మోటరోలా ఎడ్జ్ 20, రియల్ మీ 9ఐ వంటి మొబైల్స్ సైతం బడ్జెట్ ప్రైజ్ లో వస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మొబైల్ కొనుగోలు చేయాలని అనుకునే వారు ఈ ఫిచర్లను బట్టి మీకు కావాల్సిన ఫోన్ సెలక్ట్ చేసుకోండి. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయండి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp