Home » Exclusive » Snake Bit The Youth 5 Times In 30 Days
Exclusive

Snake : 35 రోజుల్లో ఒకే వ్య‌క్తిని ఆరు సార్లు కాటేసిన పాము.. బ్ర‌తికాడా, చనిపోయాడా..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 9, 2024 2:38 pm
Advertisement

Snake : మ‌న దేశంలో ఏటా పాము కాటుకు గురై చాలా మంది ప్రాణాలు కోల్పోతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వర్షాకాలం సీజన్‌లో పాము కాటుకి సంబంధించిన వార్త‌లు ఎక్కువ‌గా వింటుంటాం. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఫతేపూర్‌లో వికాస్ దూబే అనే వ్యక్తిని 35 రోజుల్లో ఆరు సార్లు పాము కరిచింది. అయినా అతడు ప్రతిసారీ చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో డాక్టర్లు కూడా షాక్ అవుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామంలో వికాస్ దూబే (24) అనే యువకుడు నివసిస్తున్నాడు. అయితే ఈ యువకుడుకి నెలన్నర వ్యవధిలో ఐదుసార్లు పాము కాటుకు గురైనప్పటికీ, చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు.

Advertisement

Snake ప‌గ‌బ‌ట్టిందా ఏంటి?

కాగా, ఇప్పటికే అతడు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎందుకంటే.. గతనెల జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు ఆ యువకుడు మంచం దిగుతుండగా తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లారు. అక్కడే రెండు రోజులు చికిత్స తీసుకొని కోలుకుని ఇంటికి వచ్చారు. ఇక‌ మళ్లీ అదే పాము జూన్ 10వ తేదీ రాత్రి మళ్లీ ఆ యువకుడుని కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈసారి కూడా చికిత్స అనంతరం కోలుకోవడం విశేషం. అయితే పాము చూసి భయపడి జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు.అయితే ఏడు రోజుల తర్వాత (జూన్ 17) ఇంట్లో మరోసారి పాము కాటువేయడంతో పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇక నాలుగోసారి కూడా పాము కాటేసి 7 రోజులు కూడా గడవకముందే.. మరోసారి వికాస్‌ను పాము కాటేసింది. ఈ క్రమంలోనే భయపడిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. బంధువులు, డాక్టర్ కొద్దిరోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాలని సూచించారు.

Snake : 35 రోజుల్లో ఒకే వ్య‌క్తిని ఆరు సార్లు కాటేసిన పాము.. బ్ర‌తికాడా, చనిపోయాడా..!

Advertisement

ఈ సలహా మేరకు రాధానగర్‌లోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మళ్లీ ఇంట్లో పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత అతడిని కుటుంబ సభ్యులు అదే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం అతను మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామంలోని తన మామ సంతోష్ దూబే ఇంటికి వెళ్లాడు. అయితే జూలై 6వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా పాము ఆరోసారి కాటు వేసింది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గతంలో చికిత్స చేసిన ఆసుపత్రిలోనే చేర్పించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో వైద్యులు అతడిని ఇంటికి పంపించారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి