Indian 2 Movie : మరి కొద్ది రోజులలో ప్రేక్షకులని అలరించేందుకు భారతీయుడు 2 చిత్రం సిద్ధమైంది. ఈ చిత్రం శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు చేస్తూ ‘U/A’ (యూ/ఏ) సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని పదాలను మ్యూట్ చేయాలని మూవీ యూనిట్‌కు సూచించినట్లుగా సమాచారం.
‘భారతీయుడు 2’ రన్‌టైం ఏకంగా 3 గంటల నాలుగు నిమిషాలు వచ్చింది. అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలని అంటే మాటలు కాదు. సినిమాలో ఆకట్టుకునే కథ, కథనాలు ఉండాల్సిందే. కాగా.. రన్‌టైం విషయంలో శంకర్ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదట. కథపై శంకర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారట. ఇటీవల ‘యానిమల్’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ లాంటి మూవీలు మూడు గంటల రన్ టైమ్‌తో వచ్చాయి. కంటెంట్ ఉంటే ఎంతసేపైనా థియేటర్లలో ప్రేక్షకులు కూర్చొంటారు అని ఈ సినిమాలు నిరూపించాయి.
అయితే 1996లో వచ్చిన భారతీయుడు చిత్రాన్ని మురిపించేలా భారతీయుడు 2 ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల శంకర్ ఫామ్ కూడా ఆశాజనకంగా లేదు. ఆయన పెద్ద దర్శకుడు అయినప్పటికీ తడబడుతున్నారు. అలాంటివి ఏమీ జరగకుండా భారతీయుడు 2 మెప్పించాలని అంతా కోరుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా పోరాడే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్రబృందం ధీమాగా ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.