Chandrababu : చంద్రబాబుని విపరీతంగా ర్యాగింగ్ చేస్తోన్న సోషల్ మీడియా.. కారణం ఇదే !
Chandrababu : అన్నీ నేనే. అసలు ఈ భారతదేశం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం నేనే. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది నేనే.. అంటూ ఇలా చెప్పుకునే వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన ఏం మాట్లాడినా విమర్శలపాలు అవడమే. ఆయన మాటలే అలా ఉంటాయి మరి. ఆయన ఏం మాట్లాడినా.. ఆయన మాటలను పల్లకి మోస్తుంటుంది ఎల్లో మీడియా. ఈ దేశంలో రాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న నాయకుడు ఎవరూ లేరని..
తనకే 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ ఉంటారు.ఈ కాలానికి వస్తే.. ఉమ్మడి ఏపీలో తాను చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదంటారు ఆయన. ప్రపంచపటంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం వచ్చిందంటే దానికి కారణం ఎవరు.. అంటూ ఎక్కడికి పోయినా ఇదే గోల. ఏపీలోనూ ఇదే గోల. అందుకే.. ఇలాంటి మాటలు ఆయన నోటి నుంచి విని విని జనాలకు కూడా చిర్రెత్తుకొచ్చేసింది. అందుకే సోషల్ మీడియాలో చంద్రబాబుపై జనాలు తెగ ఫైర్ అయిపోతున్నారు.
Chandrababu : ఒకరకంగా ఆయన్ను ర్యాగింగ్ చేస్తున్నారు
చంద్రబాబు.. నువ్వు ముఖ్యమంత్రివి కాకముందే.. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కు కాంగ్రెస్ సీఎంలు ఉన్న కాలంలోనే ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు వచ్చాయంటూ ఆయా కంపెనీల లిస్టు కూడా చంద్రబాబు ముందు పెడుతున్నారు జనాలు. బెల్ కంపెనీ ఎప్పుడు వచ్చిం. హెచ్ఏఎల్, హెచ్ఎంటీ, బీఈఎంల్, మిదానీ, డీఆర్డీఎల్, డీఆర్డీవో, ఈసీఐల్, ఐడీపీఎల్, ఐఐసీటీ, భారత్ డైనమిక్స్.. ఇవన్నీ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు వచ్చాయా చంద్రబాబు. ఇవి నువ్వు రాజకీయాల్లోకి రాకముందే హైదరాబాద్ కు వచ్చాయి. హైదరాబాద్ ఇప్పుడు కాదు.. 400 ఏళ్ల కిందనే డెవలప్ అయింది.. కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలోనే ఇవన్నీ వచ్చాయి. అప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నావు చంద్రబాబు అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో చంద్రబాబును ఆడుకుంటున్నారు.