Harsha Sai : హర్ష సాయి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా లో ఈయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా అంతా కాదు. యూట్యూబర్ గా చాలా మందికి పరిచయమైన హర్ష సాయి ఈ మధ్య కాలంలో రియల్ హీరో గా పేరు సంపాదించుకుంటున్నాడు. రోడ్డున వెళ్తూ వెళ్తూ కొబ్బరి బోండాలు కొట్టే వ్యక్తికి 20వేల రూపాయలు… రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తికి పదివేల రూపాయలు ఇలా వేలకు వేల రూపాయలు సాయం చేసుకుంటూ వెళ్తాడు. ఆ సాయం యూట్యూబ్ ద్వారా చూపించి ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నానంటూ హర్ష సాయి చెప్పుకుంటున్నాడు. ప్రస్తుతం హర్ష సాయికి భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన నుండి లక్షల రూపాయల సాయం పొందిన వాళ్లు అతి కొద్ది మంది.. ఆ కొద్ది మంది ఇప్పుడు హర్ష సాయి ని దేవుడిగా పూజిస్తున్నారు.
చిన్న పిల్లలకు టీవీలు సైకిల్స్ ఇచ్చి యూట్యూబ్ లో వీడియోలు పెట్టి తాను దేవుడిని, గొప్ప సాయం చేసిన వాడిని అంటూ చెప్పుకుంటున్నాడని కొందరు హర్ష సాయి తీరుపై విమర్శలు చేస్తున్నారు. రూపాయి సాయం చేసి వంద రూపాయల పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అంటే తీవ్ర విమర్శలు హర్ష సాయిపై వస్తున్నాయి. వందలో పది మంది హర్ష సాయిని విమర్శిస్తున్నారు. కానీ 90 మంది మాత్రం ఆయనను అభిమానిస్తున్నారు. ఒకప్పుడు అందరూ కూడా హర్ష సాయిని అభినందించేవారు. కానీ ఇప్పుడు మెల్ల మెల్లగా ఆయనను విమర్శిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. కేవలం పబ్లిసిటీ కోసమే సాయం అన్నట్లుగా అతడి ప్రవర్తన ఉంటుందని చాలా మంది, చాలా రకాలుగా ఉదాహరణలతో సహా చూపిస్తే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హర్ష సాయి ఒక వ్యక్తి వద్దకు వెళ్లి పది వేల రూపాయల సాయం చేయడం జరిగింది. ఆ సాయంను యూట్యూబ్ ద్వారా చూపిస్తూ లక్షల రూపాయల సాయం చేసినట్లుగా హైప్ ఇచ్చాడు.
దాంతో ఇదెక్కడి విడ్డూరం హర్ష సాయి అన్న అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సాయం ఎంతో మంది చేస్తూ ఉంటారు, కానీ నువ్వు మాత్రమే ఎందుకు యూట్యూబ్ ద్వారా తెగ హడావుడి చేస్తున్నావు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాఫర్ అడిగిన సందర్భంగా హర్ష సాయి ఆసక్తికర సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. తాను చేసిన సాయం గురించి యూట్యూబ్లో చూపించి దాని ద్వారా వచ్చిన డబ్బును మళ్ళీ సాయానికే ఉపయోగిస్తాను అంటూ హర్ష సాయి చెప్పుకొచ్చాడు. నిజమే హర్ష సాయి అలా చూపిస్తేనే యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి. కనుక యూట్యూబ్ న్యూస్ కోసం హర్ష సాయి ఆ హడావిడి చేస్తున్నాడు.. అంతే తప్ప ఆయన తప్పేం లేదని నలుగురికి సాయం చేయాలని అనుకోవడం తప్పు కాదని, అతడిని విమర్శించే వాళ్ళు అభద్రత భావంతో కొట్టు మిట్లాడుతున్న వారు అంటూ హర్ష సాయి అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.