Sonia Gandhi : వెనకడుగు వేసిన సోనియా గాంధీ.. ఇన్నేళ్ల కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటి సారి
Sonia Gandhi : ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకున్న విషయం తెలిసిందే. సోనియా గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీలో చీలికలు మొదలైనట్టుగా బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వడం కోసం సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ ను తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ అధినాయకత్వం తెలిపింది. అంటే.. ముఖ్యమంత్రి పదవి సచిన్ పైలట్ కు దక్కనుంది. సీఎం పదవికి రాజీనామా చేయించి.. వేరే వ్యక్తిని అంటే సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆడుతున్న నాటకం అంటూ.. గెహ్లట్ వర్గీయులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో ఏకంగా సోనియా గాంధీ నాయకత్వంపైనే తిరుగుబాటు మొదలైంది.. అంటూ బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో వచ్చిన అసమ్మతి కాదు.. ఇది పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న అసమ్మతే అంటూ బీజేపీ నేత అమిత్ మాలవియా వ్యాఖ్యానించారు. ఒకరకంగా ఈ అసమ్మతి.. సోనియా గాంధీ స్థాయిని తగ్గించేదిగా ఉంది. ఇక నుంచి గాంధీ కుటుంబంపై ఇతరులు ఎవ్వరు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టినా వాళ్లకు విశ్వాసం ఉండదంటూ చెప్పుకొచ్చారు. ఇక నుంచి తిరుగుబాట్లు తప్పవని కామెంట్ చేశారు.
Sonia Gandhi : సీఎంగా సచిల్ పైలట్ కు ఎందుకు నో చెబుతున్నారు?
నిజానికి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో రాజస్థాన్ లో సంక్షోభం నెలకొన్నది. రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లట్ ను కాదని.. సీఎం పదవిని సచిన్ కు ఇవ్వడం అశోక్ వర్గీయులకు నచ్చడం లేదు. చివరకు హైకమాండ్ చెప్పినా కూడా అస్సలు వినడం లేదు. ఇదంతా గెహ్లట్ నేతృత్వంలోనే జరుగుతోందని.. ఆయన సూచనల మేరకే ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదు.. గెహ్లట్ కు మద్దతుగా రాజీనామా చేసేందుకు కూడా పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేస్ నుంచి గెహ్లట్ ను తప్పించాల్సి వచ్చింది హైకమాండ్ కు. ప్రస్తుతం మరో ఇద్దరు ముగ్గురి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది.