sonu sood fan meets him in mumbai by walking from hyd
Sonu Sood : సోనూ సూద్.. ప్రత్యక్ష దేవుడు. నిజంగా దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ.. సోనూ సూద్ ను చూస్తే మాత్రం ప్రత్యక్ష దేవుడిగా కనిపిస్తారు. కరోనా వచ్చాకే తెలిసింది సోనూ సూద్ లో ఉన్న మానవత్వం. గత సంవత్సరం నుంచి ఆపదలో ఉన్నవాళ్లందరికీ తానే దిక్కుగా మారారు. ఎంతో మంది కష్టాలను, కన్నీళ్లను తూడ్చుతూ గొప్ప మనిషి అయ్యారు ఆయన. దేశమంతా ఆయన్ను రియల్ హీరో అంటూ పొగుడుతోంది. కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు వలస కూలీలను తన సొంత ఖర్చులతో తమ స్వస్థలాలకు పంపించిన గొప్ప మనిషి. ఆ తర్వాత ఆపదలో ఉన్నాం.. అని ఆయన దగ్గరకు వెళ్లిన వాళ్లందరికీ.. తనకు తోచిన సాయం చేస్తున్న సోనూ సూద్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
sonu sood fan meets him in mumbai by walking from hyd
అందుకే కాబోలు.. సోనూ సూద్ కు ఓ అభిమాని తన గుండెల్లో గుడి కట్టేశాడు. గుడి కట్టడమే కాదు.. ఆయన్ను ఎలాగైనా కలవాలన్న సదుద్దేశంతో పెద్ద సాహసానికే ఒడిగట్టాడు. దాని కోసం ఓ యువకుడు ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబై వరకు.. పాదయాత్ర చేసి మరీ.. సోనూ సూద్ ను కలుసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ముంబైకి కనీసం 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే.. బస్సుల్లో ట్రెయిన్స్ లో వెళ్లి సోనూసూద్ ను కలిస్తే ఏముంటుంది అని అనుకున్నాడో ఏమో.. తన అభిమానాన్ని పాదయాత్ర రూపంలో చూపించాడు. అది కూడా చెప్పులు లేకుండా.. హైదరాబాద్ నుంచి ముంబైకి సోనూసూద్ ప్లకార్డ్ ను పట్టుకొని కాలినడకన నడవడం ప్రారంభించి.. చివరకు సోనూ సూద్ ఇంటికి చేరుకున్నాడు.
sonu sood fan meets him in mumbai by walking from hyd
అయితే.. హైదరాబాద్ నుంచి ముంబైకి తనను కలవడానికి వచ్చిన వెంకటేశ్ అనే యువకుడిని కలుసుకున్న సోనూసూద్ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అంత దూరం కాలి నడకన.. చెప్పులు లేకుండా నడుచుకుంటూ రావడం తనను బాధించిందన్నారు. వెంకటేశ్ స్ఫూర్తి తనను గర్వపడేలా చేసినా.. ఇలాంటి సాహసాలకు మరెవ్వరూ పాల్పడకూడదంటూ.. సోనూ సూద్.. రిక్వెస్ట్ చేశారు. వెంకటేశ్ యోగక్షేమాలను అడిగిన సోనూ సూద్.. తన నివాసంలో కాసేపు ఉంచుకున్నారు. వెంకటేశ్.. హైదరాబాద్ నుంచి ముంబైకి కాలినడకన వచ్చాడంటూ.. అతడితో దిగిన ఫోటోను సోనూసూద్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.