
Sr NTR's Daughter Uma maheshwari Hangs herself, dies.!
Uma Maheshwari : విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుకి మొత్తం పన్నెండు మంది సంతానం. అందులో నలుగురు కుమార్తెలు. ఆ నలుగురిలో చిన్నవారైన ఉమామహేశ్వరి నేడు మృతి చెందారు. తొలుత ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారనే వార్తలు వచ్చయి. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ధృవీకరించబడింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉమామహేశ్వరి బాధపడుతున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అనారోగ్యానికి తోడు తీవ్ర మానసిక ఒత్తిడికి ఆమె లోనయ్యారంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పేర్కొన్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారనీ, రెండు గంటలైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం పంపామని తెలిపారు దీక్షిత. అయితే, ఆత్మహత్య చేసుకునేంత బలమైన సమస్య ఆమెకు ఏం వచ్చి పడింది.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనారోగ్యమే ఆమె మానసిక ఒత్తిడికి గురవడానికి కారణమన్న వాదన ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఎప్పుడూ నవ్వుతూ వుండే ఉమామహేశ్వరి ఇలా బలవన్మరణానికి పాల్పడటాన్ని ఎన్టీయార్ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Sr NTR’s Daughter Uma maheshwari Hangs herself, dies.!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల్ని ఉదార్చుతున్నారు. సోదరి మరణాన్ని బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారు. ఆత్మహత్య కావడంతో, పోస్టుమార్టం వంటి వ్యవహారాల్ని బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారట. ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు కొందరు విదేశాల్లో వుండడంతో, వారి రాక నిమిత్తం అంత్యక్రియల్ని ఎల్లుండి వరకూ చేసే అవకాశం వుంది. కుటంబ పరమైన సమస్యలు ఏమైనా వున్నాయా.? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.