Sri Reddy : వామ్మో శ్రీరెడ్డి మళ్లీ రెచ్చిపోయింది.. పవన్ కళ్యాణ్ కు చెప్పులు చూపిస్తూ ఏం చేసిందో తెలుసా?
Sri Reddy : గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించే చర్చ నడుస్తోంది. వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడిన తీరుపై అందరూ చర్చించుకుంటున్నారు. చెప్పు చూపించి మరీ.. పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో ఇది కదా అసలైన రాజకీయం అంటూ పలువురు పవన్ కు మద్దతిచ్చారు. ఈనేపథ్యంలో సంచలన స్టార్ శ్రీరెడ్డి మరోసారి ఈ విషయంపై రెచ్చిపోయింది. మరోసారి బుతుపురాణాన్ని మొదలుపెట్టింది. ఫేస్ బుక్ లో తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది శ్రీరెడ్డి.
ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది. నిజానికి శ్రీరెడ్డికి వైసీపీపై కాస్త ఫేవర్ గా ఉంటుంది.అందుకే.. వైసీపీని ఎవరైనా విమర్శిస్తే శ్రీరెడ్డి అస్సలు ఊరుకోదు. అవతలి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే అస్సలు ఊరుకోదు. రెచ్చిపోతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విరుచుకుపడటంతో శ్రీరెడ్డి పవన్ పై విరుచుకుపడిందన్నమాట. ఫేస్ బుక్ లైవ్ లో రెచ్చిపోయిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విరుచుకుపడింది. పవన్ పై బూతలతో రెచ్చిపోయింది. ఇది బాటా వాళ్ల చెప్పు.. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీంతో కొడితే మామూలుగా ఉండదు మరి.

sri reddy shows chappal to pawan kalyan
Sri Reddy : వైపీపీ నేతలను పవన్ తిట్టడంతో పవన్ పై రెచ్చిపోయింది
నీ పిచ్చితనానికి, వెర్రితనానికి, నీ రౌడీయిజానికి నా చెప్పులతో నమస్కారం పవన్ కళ్యాణ్ అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. నన్ను ఎవడు తిట్టుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సిగ్గులేని దానికి తెడ్డే లింగం.. అస్సలు భయపడను. మీరు చేస్తున్నది ప్రజాస్వామ్యమా… ఇంకేమైనా ఉందా? మంత్రులను కొట్టి, చెప్పులు చూపించి రౌడీయిజం చేస్తారా? అసలు మీకు రౌడీయిజం అంటే ఎలా ఉంటుందో చూపించాల్సిందే అంటూ బీభత్సం చేసింది శ్రీరెడ్డి. అసలు నీకు ఒక జెండా ఉందా? ఒక అజెండా ఉందా? ఆ బుల్లిగాడు ఏం చేయమంటే అది చేస్తావా అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి.
