Police SI Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో 4187 ఉద్యోగాలు .. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!
ప్రధానాంశాలు:
Police SI Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో 4187 ఉద్యోగాలు .. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!
Police SI Jobs : నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.భారీ వేతనంతో ఉన్న ఈ ఉద్యోగాలను సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీసు సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ లో SI ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 4187 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ విభాగాలుగా నియామకాలు చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ పాసైన అభ్యర్థులు పోటీ చేయవచ్చు. మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మార్చి 4 నుంచి ప్రారంభమైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే వేతనం కూడా భారీగా అందుకోవచ్చు. నెలకు 35,400 నుంచి 1,12,400 వరకు జీతం అందిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ ను https://ssc.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది. 4187 పోస్టులలో విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేశారు.
1) సీఎపీఎఫ్ ( సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ ) -4001
2) ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు – 125
3) ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) – మహిళలు – 61
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి. నిబంధనల ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల వయసు 2024 నాటికి 20,25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సీబీటీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్మ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక అభ్యర్థులు దరఖాస్తు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు మినహాయింపు కలదు. ఈ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభమై మార్చి 28 వరకు ముగుస్తుంది. దరఖాస్తు సవరణకు మార్చి 30 నుంచి మార్చి 31 వరకు, మే 9 , 10,13 తేదీల్లో సీబీటీ పరీక్షలు నిర్వహిస్తారు.