sudigali sudheer and rashmi in dhee 13 show
Sudheer : సుడిగాలి సుధీర్ ఎక్కడుంటే అక్కడ రచ్చనే. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులే. సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు బుల్లితెర మీద ఆయన ఇప్పుడు పెద్ద సెన్సేషన్. సుడిగాలి సుధీర్ తెలుగు బుల్లితెరను ఏలేస్తున్నాడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. మొత్తం మీద టాప్ కమెడియన్ గా స్థానం సంపాదించాడు సుధీర్. ఇక.. సుధీర్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే కదా. రష్మీ, సుధీర్.. ఇద్దరూ గత 8 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారని అంతా అంటున్నారు. అయితే.. వాళ్లిద్దరి మధ్య ఏం ఉన్నది? లేదు? అనేది ఎవ్వరికీ తెలియదు కానీ.. షోలలో కానీ.. జబర్దస్త్ లో కానీ.. వాళ్ల మధ్య రాపో మాత్రం బాగానే ఉంటుంది.
sudigali sudheer and rashmi in dhee 13 show
వాళ్ల ప్రేమ వ్యవహారం విషయం పక్కన పెడితే.. ఆ జంటకు ఆన్ స్క్రీన్ మీద ఉన్న క్రేజే వేరు. ఇద్దరూ కలిస్తే రచ్చ రంబోలానే. వాళ్లిద్దరూ కలిసి చాలాసార్లు ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేశారు. అది బాగా పండింది కూడా. ఢీ షోలో కూడా ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండదు.
సుడిగాలి సుధీర్ అంటే ఖచ్చితంగా రష్మీ అనే పేరు రావాల్సిందే. కానీ.. సుడిగాలి సుధీర్ మాత్రం రష్మీని వదిలేసి.. జడ్జి పూర్ణతో రొమాన్స్ చేశాడు. ఢీ షోలో సుడిగాలి సుధీర్ జడ్జి పూర్ణతో.. హైపర్ ఆది.. జడ్జి ప్రియమణితో రొమాన్స్ చేస్తుండగా.. రష్మీ, దీపిక.. ఇద్దరూ వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
sudigali sudheer and rashmi in dhee 13 show
ఏంటి సుధీర్.. మన 8 ఏళ్ల బంధానికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? నీకిది తగునా? ఇవ్వాలో రేపో నీ లవ్ ప్రపోజల్ ను ఒప్పుకుందామనుకున్నా. కానీ.. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు.. అంటూ రష్మీ సుడిగాలి సుధీర్ ను ఏకి పారేసింది. దీపిక కూడా అంతే.. హైపర్ ఆదిపైకి ఎక్కేసింది. ఇలా.. రష్మీ ముందు సుడిగాలి సుధీర్ అడ్డంగా దొరికిపోయాడు.
sudigali sudheer and rashmi in dhee 13 show
ఆగండాగండి.. ఇదంతా నిజం అనుకునేరు. ఇది నిజం కాదు. అంతా ఉత్తుత్తి. ఢీ షోలో వీళ్లంతా కలిసి ఓ స్కిట్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమోనే తాజాగా విడుదల చేశారు. అంతే.. అంతకుమించి ఇంకేం కాదు. ఏది ఏమైనా.. అది స్కిట్ అయినా కూడా.. రష్మీ మాత్రం తన మనసులో మాటను నిజంగానే బయటపెట్టినట్టు కనిపిస్తోంది. జడ్జి పూర్ణతో రొమాన్స్ చేస్తుంటే తను చూస్తూ తట్టుకోలేకపోయింది. అంటే.. సుధీర్ మీద తనకు కాస్తో కూస్తో ప్రేమ ఉందన్నమాట. సరె సర్లే.. ముందైతే ఢీ షో లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
This website uses cookies.