Beer : ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగా బీర్ తాగుదామని మందు బాబులు ఉవ్విళ్లూరుతుంటారు. వయసుతో సంబంధం లేకుండా బీర్లను లాగించేస్తుంటారు. మిగతా కాలాలతో పోలిస్తే ఒక్క ఎండాకాలంలోనే బీర్ల అమ్మకాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మందు తాగే వాళ్లు కూడా ఎక్కువగా బీర్లు తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ఎన్నడూ లేనంతగా బీర్లు అమ్ముడు పోతుంటాయని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా మనతెలంగాణలో అయితే ఇది కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. ఇందుకు గత ఏడాది అమ్ముడు పోయిన బీర్లే ఉదాహరణ.
ఇక ఈ ఏడాది మార్చిలో అమ్ముడు పోయిన బీర్ల సంఖ్య చూసుకుంటే.. సుమారు 48,71,668 కేసుల బీర్ విక్రయాలతో రూ.1458 కోట్ల రాబడిని అబ్కారీ శాఖ నమోదు చేసుకుందని అంటున్నారు. మార్చిలోనే మందుబాబులు ఈ రేంజ్ లో బీర్లను లేపేస్తే.. ఇక రాబోయే ఏప్రిల్, మే నెలలో బీర్లు ఏ రేంజ్ లో అమ్ముడు పోతాయో ఊహించడానికే షాకింగ్ గా ఉంది. అయితే ఇప్పుడు బీర్ల ప్రియులకు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే రాబోయే రోజల్లు బీర్ల తయారీ కష్టమేనంట. ఎందుకంటే ఇప్పుడు వేసవిలో నీటి కష్టాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తండాల నుంచి మొదలు పెడితే నగరాల వరకు తాగునీరు, సాగునీరు అందక జనాలు నానా అవస్థ పడుతున్నారు.
బీర్లను మంచినీటి జలాశయాల నుంచి నీటినితీసుకుని తయారు చేస్తారు. తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మైక్రో బూర్వరీల్లో బీర్ల తయారీ అక్కడికక్కడే జరిగేలా అనుమతిచ్చింది. దీంతో సిటీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వీటి తయారీకి ఇప్పుడు నీటిఎద్దడి సమస్యగా మారింది. ఇక బీర్ల తయారీకి ఎక్కువగా సింగూరు జలాశయం నుంచి నీళ్లు ఇచ్చేవారు. 4 బ్రూవరీలకు రొజుకి కనీసం 44 లక్షల నీరు అవసరం అని తెలుస్తుంది. పటాన్ చెరువులో ఉండే పటాంచెరువు పరిధిలోని ఎస్.ఏ.బి. మిల్లర్ ఇండియా, యునైటెడ్ బ్రూవరీసి, కర్స్ల్ బెర్గ్ ఇండియా, క్రౌన్ బీర్స్ బ్రువరీలకు నీటిని సరఫరాను ఇన్ని రోజులు చేశారు.
కానీ ఇప్పుడు సింగూరు జలాశయం నీటిని తాగునీరు, సాగునీరు సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగించాలని అధికారులు నిర్ణయించుకున్నారంట. అందుకే ఇప్పుడు బీర్ల తయారీకి నీటి సమస్య అడ్డుగా వచ్చిందని అంటున్నారు. కాబట్టి రాబోయే రెండు నెలలు బీర్ల తయారీ తగ్గిపోవచ్చు.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.