
Minister Roja : చంద్రబాబుపై మంత్రి రోజా సంచల కామెంట్స్... ఎన్నికల తర్వాత చంద్రబాబు కనిపించడం కష్టమే...!
Minister Roja : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా సరే అధికారం పొందేందుకు ఇరుపక్షాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరుపక్ష పార్టీల నేతలు సైతం భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఒంటరి పోరాటం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక టీడీపీ ,జనసేన ,బీజేపీ కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు పలువురు ప్రతిపక్ష పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మినిస్టర్ రోజా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబును ఉద్దేశించి పలు రకాల విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జగనన్న ఏం చెప్తే అది కచ్చితంగా జరుగుతుంది. ఇక చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చెప్పిన సరే అది అసలు జరగని పని. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ చేసింది మాత్రం ఏమీ లేదు. ఇక 14 సంవత్సరాలు కూడా వేరే వేరే పరిస్థితుల వలన గెలిచాడు తప్ప ఆయన కృషి ఏమీ లేదని రోజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు మొదట సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఎన్నికల్లో గెలిచాడు.
ఇక రెండోసారి వాజ్ పాయి గారి పేరుతో అధికారంలోకి వచ్చారు. ఇక మూడవసారి మోడీ గారి పేరుతో అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా బీజేపీ మరియు జనసేనతో పొత్తుగా కలిసి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే 2014లో మన తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమల తిరుపతిలో మీటింగ్ సమావేశాలు ఏర్పాటుచేసి తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారని వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్కదాన్ని కూడా చంద్రబాబు తీసుకురాలేకపోయారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా స్కామ్ లు మాత్రం చేశాడు.దీంతో ఈ మధ్యనే దానికి సంబంధించిన కేసులలో కూడా చంద్రబాబు ఇరుక్కున్నారు. అయితే చంద్రబాబు చేసిన ఇలాంటి పనులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు స్వీకరించబోరని మంత్రి రోజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ పరిపాలన చూసేశారు . పవర్ లో ఉన్నప్పుడు చేయలేనివారు పవర్ లో లేనప్పుడు మేము చేస్తాం అధికారం ఇవ్వండి అంటే ప్రజలు ఎలా నమ్ముతారని ఈ సందర్భంగా రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Roja : చంద్రబాబుపై మంత్రి రోజా సంచల కామెంట్స్… ఎన్నికల తర్వాత చంద్రబాబు కనిపించడం కష్టమే…!
అంతేకాదు ఇటీవల పోత్తులో భాగంగా బీజేపీ మరియు జనసేన టీడీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభ నరేంద్ర మోడీ రాజకీయ చరిత్రలోనే అత్యంత నీచమైనదని రోజా పేర్కొన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీకి కూడా ఆ విషయం అర్థమై ఉంటుందని జగనన్న సిద్ధం సభలో ఎంత జనాదరణ ఉంది అని నరేంద్ర మోడీ చూసే ఉంటారు. ఈ విధంగా అన్ని విధాలుగా జగనన్న ముందున్నారని ఈ సందర్భంగా రోజా తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా నిలబడి ఈసారి ఎలక్షన్స్ లో కూడా మనం గెలిచే విధంగా చర్యలు చేపట్టాలని రోజా కోరారు. ఈసారి అధికారంలోకి వస్తే జగనన్న దగ్గర మన పరువు ఉంటుందని మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని రోజా పేర్కొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి మన పార్టీ యొక్క ప్రతిష్ట గురించి తెలియజేయాల్సిందిగా రోజా పిలుపునిచ్చారు. ఈ విధంగా మంచి మెజారిటీతో మనం విజయం సాధిస్తే మన నియోజకవర్గంలో మంచి పనులు చేయవచ్చు అని , కాబట్టి మీరందరూ నాకు తోడుగా నిలబడాలని మంత్రి రోజా కోరారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది.
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.