Supreme Court : అన్నీ ఫ్రీ అని చెప్పుకునే రాజకీయ నేతలకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..!
Supreme Court : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీకాలం ఈరోజుతో పూర్తి కావడంతో జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ చివరి రోజు విచారణలో ఉన్న కేసులన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ తర్వాత ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణకు ఇవాళ చివరి రోజు కావడంతో పెండింగ్ లో ఉన్న చాలా కేసులను ఆయన ఇవాళ పరిష్కరించారు.
అయితే.. దేశంలో, పలు రాష్ట్రాల్లో అందించే ఉచిత పథకాలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉచిత పథకం సంక్షేమ పథకమే అని ఎలా తేల్చాలి అని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. హామీలను గుప్పించకుండా రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను నియంత్రించలేమని ఎన్వీ రమణ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఉచిత విద్య, ఉచిత తాగునీరు లాంటి పథకాలన్నీ ఉచితాలే కదా అని ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Supreme Court : 2013 లో ఇచ్చిన తీర్పుపై పున : సమీక్ష
సుప్రీం కోర్టు 2013 లోనే ప్రజలకు ఇచ్చే ఉచితాలపై తీర్పును వెలువరించింది. దానిపై సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం రాజకీయ నాయకులు ఉచిత హామీలపై వాదనలను విన్నది. ఎన్నికలకు ముందు ఉచితాల పేరుతో హామీలను ఇచ్చే రాజకీయ పార్టీలను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ముఖ్యమైన ఉత్తర్వులను సీజేఐ వెలువరించారు. అయితే.. రాజకీయ పార్టీలకు చెందిన ఇలాంటి అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం ఎందుకు రాజకీయ పార్టీలను పిలవలేదంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటే తప్ప.. ఏం జరగదు అని సుప్రీం వెల్లడించింది. ఉచితాలపై ఖచ్చితంగా చర్చ జరగాలి. ఇది తీవ్రమైన సమస్య. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కానీ.. అసలు ప్రశ్న ఏంటంటే.. అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యపై ఎందుకు ఏకాభిప్రాయంతో ఉండకూడదు. ఎందుకు ఈ సమస్యపై పార్టీలన్నీ కలిసి నిర్ణయం తీసుకోకూడదు. కేంద్రం కూడా ఈ సమస్యపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కలిసి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం తెలిపింది.