YS Jagan : సీఎం జగన్‌పై సుప్రీం కోర్టు ప్రశంసలు.. ఎట్టకేలకు గెలిచిన జగన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : సీఎం జగన్‌పై సుప్రీం కోర్టు ప్రశంసలు.. ఎట్టకేలకు గెలిచిన జగన్

YS Jagan : ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతోంది. ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రాత్రికి రాత్రే మారుతున్నాయి. రాజకీయాలన్నీ హీటెక్కాయి. ఏపీలో ప్రస్తుతం పాలన వైసీపీ కేంద్రంగానే నడుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాయి. ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు సంఘ విద్రోహ శక్తులు కూడా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :21 August 2023,6:00 pm

YS Jagan : ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతోంది. ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రాత్రికి రాత్రే మారుతున్నాయి. రాజకీయాలన్నీ హీటెక్కాయి. ఏపీలో ప్రస్తుతం పాలన వైసీపీ కేంద్రంగానే నడుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాయి. ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరోవైపు సంఘ విద్రోహ శక్తులు కూడా రెచ్చిపోతున్నాయి. కోర్టుల్లో తగిన తీర్పులు వస్తేనే వీళ్లకు ఉచ్చు బిగిస్తున్నారు. కోర్టుల్లో ఉన్న లొసుగులను వాడుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను శెభాష్ అంటున్నాయి కోర్టులు. ఎందుకంటే.. ఏపీలో ప్రస్తుతం ఒక వ్యక్తి మద్యం స్మగ్లింగ్ ను పెద్ద ఎత్తున్న చేస్తున్నారట. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. వాళ్లపై వైసీపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. చట్టపరమైన కేసులు పెడుతూ ముందుకు వెళ్తోంది. దీంతో ఈ మద్యం స్మగ్లర్ హైకోర్టు కాదు.. ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. కానీ.. ఏపీ ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు.

supreme court praises ap cm ys jagan

supreme court praises ap cm ys jagan

 

YS Jagan : నిర్బంధన కరెక్టే అని ఏపీ ప్రభుత్వాన్ని శెభాష్ అన్న సుప్రీం కోర్టు

అయితే.. నిర్బంధన కరెక్టే అని.. అటువంటి వాళ్లను నిర్బంధించడం కరెక్టే అని సుప్రీం కోర్టు కూడా ఏపీ ప్రభుత్వాన్ని శెభాష్ అని మెచ్చుకుంది. మద్యం స్మగ్లర్లపై, అక్రమ రవాణాపై దృష్టి పెట్టిన ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం. అతడు కోర్టుల్లోకి వెళ్లినా.. నన్ను మించింది ఇంకేముంది అనుకున్నాడు. డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకునే వాళ్లు ఈ ఘటన చెంపపెట్టు. కోర్టుల్లో న్యాయం చాలా సార్లు గెలుస్తుంది. కోర్టులు కూడా న్యాయం చేస్తున్నాయి కాబట్టే సమాజం ఇలా ఉంది. ఏది ఏమైనా.. సీఎం జగన్ వ్యూహం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు కూడా ప్రశంసలు కురిపించింది. ఇక నిన్ను ఎవరూ ఆపేది లేదు అని ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. తప్పు చేసిన వాడిని ముక్కు పిండి మరీ కూర్చోబెట్టాలి. అప్పుడు మళ్లీ తప్పు చేయాలని అనుకునేవాడు భయపడతాడు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది