Categories: andhra pradeshNews

Supreme Court | విద్యుత్ సుంకాలపై ఏపీకి సుప్రీంకోర్టులో ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే

Supreme Court | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విద్యుత్ వినియోగదారులపై సుంకం పెంపుతో సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్‌ల ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

#image_title

ఏం జ‌రిగింది అంటే..

2022 ఏప్రిల్ 8న, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 7 ద్వారా వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులపై విద్యుత్ సుంకాన్ని యూనిట్‌కు 6 పైసల నుంచి రూ.1కి పెంచింది. దీని ఆధారంగా డిస్కంలు వినియోగదారుల నుంచి రూ.6,292 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాయి.ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. విచారణ అనంతరం 2025 జూన్ 26న హైకోర్టు ఈ జీవోను కొట్టి వేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది.

ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం…
ఇది రాజ్యాంగపరమైన అంశం అని పేర్కొంది.పూర్తి వాదనలు ఆలకించాల్సిన అవసరం ఉందని చెప్పింది.ప్రస్తుతానికి హైకోర్టు తీర్పులోని ‘రిఫండ్’ అంశంపై స్టే విధించింది.తదుపరి విచారణను 2026 ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఈ కేసు రాజ్యాంగపరమైన చర్చకు దారి తీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను 2026 ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

4 days ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

4 days ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

4 days ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

4 days ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

5 days ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

5 days ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

5 days ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

5 days ago