Supreme Court | విద్యుత్ సుంకాలపై ఏపీకి సుప్రీంకోర్టులో ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే
Supreme Court | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విద్యుత్ వినియోగదారులపై సుంకం పెంపుతో సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్‌ల ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

#image_title
ఏం జరిగింది అంటే..
2022 ఏప్రిల్ 8న, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 7 ద్వారా వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులపై విద్యుత్ సుంకాన్ని యూనిట్‌కు 6 పైసల నుంచి రూ.1కి పెంచింది. దీని ఆధారంగా డిస్కంలు వినియోగదారుల నుంచి రూ.6,292 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాయి.ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. విచారణ అనంతరం 2025 జూన్ 26న హైకోర్టు ఈ జీవోను కొట్టి వేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది.
ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం…
ఇది రాజ్యాంగపరమైన అంశం అని పేర్కొంది.పూర్తి వాదనలు ఆలకించాల్సిన అవసరం ఉందని చెప్పింది.ప్రస్తుతానికి హైకోర్టు తీర్పులోని ‘రిఫండ్’ అంశంపై స్టే విధించింది.తదుపరి విచారణను 2026 ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఈ కేసు రాజ్యాంగపరమైన చర్చకు దారి తీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను 2026 ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.