Nimmagadda Ramesh : అరివీర భయంకరమైన ట్విస్ట్ ఇచ్చిన నిమ్మగడ్ రమేష్డ – వైఎస్ జగన్ కాదు టార్గెట్ ‘ ఆయనే ‘ ?
Nimmagadda Ramesh , నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేనా లేదా అంటూ చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే చర్చ. రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే ఏం చేస్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పంథంను పక్కకు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల మద్య జరుగుతున్న వార్ అంతా ఇంతా కాదు. వీరిద్దరి మద్య జరుగుతున్న కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. ఉద్యోగ సంఘాల నాయకులు తమ వల్ల కాదని ఎన్నికల నిర్వహణకు సహకరించి ప్రభుత్వంతో వైకాపాతో సున్నం పెట్టుకోలేము అంటూ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్ ఏం చేస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ జగన్‌ను వదిలి వారిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్… Nimmagadda Ramesh
నిన్న మొన్నటి వరకు నిమ్మగడ్డ టార్గెట్ సీఎం వైఎస్ జగన్ అనడంలో సందేహం లేదు. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడుకోవడం జరిగింది. కాని ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఫోకస్ మారినట్లుగా ఉంది. తను నోటిఫికేషన్ ఇచ్చినా కూడా సహకరించేది లేదు అంటూ తేల్చి చెప్పిన ఉద్యోగ సంఘం నాయకులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్‌డ సీరియస్ గా ఉన్నాడు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ తమ ప్రాణాలకు హాని కలిగించే వారికి హాని చేయడం తప్పేమి కాదని నిమ్మగడ్డను కొట్టేందుకు కూడా సిద్దం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఆ కారణంగానే ఎస్ఈసీ చాలా సీరియస్ గా గవర్నర్ కు ఫిర్యాడు చేశారు.
గవర్నవర్, సుప్రీం నిర్ణయం ఏంటో.. Nimmagadda Ramesh Kumar
ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం గా లేదు. ఈ సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎన్నికల హడావుడి ఉంటే ఎలా అంటున్నారు. ఈ సమయంలో కొందరు అధికారులు నిమ్మగడ్డ రమేష్ పై చేసిన వ్యాఖ్యలపై డిజీపీకి మరియు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. డీజీపీ ఎలా స్పందిస్తారు అనేది ప్రతి ఒక్కరు ఊహించవచ్చు. ఇక గవర్నర్ ఫిర్యాదుకు ఎలా స్పందిస్తారు అలాగే సుప్రీం కోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధింన తీర్పు ఎలా వస్తుందని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.