Tirupati Survey Results : తిరుపతి ఉపఎన్నిక ఫలితాలపై సర్వే.. షాకింగ్ రిజల్ట్స్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 April 2021,5:19 pm

Tirupati Survey Results : తిరుపతి ఉపఎన్నిక అయితే పూర్తయింది కానీ… దాని ఫలితాల కోసం అన్ని పార్టీలతో పాటు… తిరుపతి ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే.. భవిష్యత్తులో ఆ పార్టీకి ఏపీలో ఎంతో కొంత బలం ఏర్పడినట్టే. అందుకే… అధికార వైఎస్సార్సీపీతో సహా… బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఫలితాల కోసం తెగ ఆరాటపడుతున్నాయి. నిజానికి.. తిరుపతి ఉపఎన్నికల్లో ప్రధాన పోటీ అంటే అధికార వైసీపీ, టీడీపీ మధ్యే. అయితే… ఈ ఉపఎన్నిక ఫలితాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి.

survey on tirupati by election results

survey on tirupati by election results

ఈ సర్వే ప్రకారం… తిరుపతి ఉపఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ గెలవబోతున్నట్టు తెలుస్తోంది. సర్వేలో వైసీపీకి మొత్తం 59 శాతం ఓట్లు పోలయినట్టు వెల్లడయింది. ఆ తర్వాతి స్థానంలో టీడీపీ ఉండనుందట. వైఎస్సార్సీపీకి సుమారు 6 లక్షల 60 వేల ఓట్లు పోలయ్యాయని సర్వే చెబుతోంది. టీడీపీకి సుమారు 3 లక్షల 50 వేల ఓట్లు పోలయ్యాయట. ఇక… బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి మూడో స్థానంలో నిలుస్తారట. బీజేపీ, జనసేన కూటమికి సుమారు 85 వేల ఓట్లు వస్తాయని ఆ సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి 15 వేల వరకు ఓట్లు పోలయ్యాయట. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు 6 వేల వరకు ఓట్లు పోలయ్యాయని ఈ సర్వే స్పష్టం చేసింది.

Tirupati Survey Results : ఈసారి టీడీపీ ఓట్లకు గండి

ఈసారి తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంటుందని సర్వే వెల్లడించింది. బీజేపీ పార్టీ 2019 లో కేవలం 16 వేల ఓట్లే సాధించగా.. ఈ సారి మాత్రం అటూ ఇటూగా సుమారు లక్ష వరకు ఆ కూటమికి ఓట్లు పడ్డాయని సర్వే స్పష్టం చేసింది. ఇక.. వైసీపీకి తన ఓటు బ్యాంక్ మాత్రం ఎటూ కదల్లేదు. 2019 ఎన్నికల్లో ఎలాగైతే బంపర్ మెజారిటీతో తిరుపతి ప్రజలు గెలిపించారో… తాజాగా ఈ ఉపఎన్నికల్లోనూ అదే మెజారిటీతో గెలిపించబోతున్నారని సంస్థ తెలిపింది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి