nellore : పల్లెలపై కరోనా పంజా!
nellore : నెల్లూరు : కరోనా పట్టణాలనే కాదు… గ్రామాల్లో కూడా అదుపులోకి రావడం లేదు. గామాల్లో కూడా అధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మొన్న కావలి, పొదలకూరు, ప్రస్తుతం రాపూరులో పాక్షికంగా లాక్‌డౌన్ విధించారు. అయినా రోజుకు 200 పాజిటివ్ కేసులు నమోదైనా ప్రజలు ఎథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలింపులు, కరోనా నిబందనలు గాలికి వదిలేస్తున్నారు.
జిల్లాలో గత కొన్నిరోజులుగా రోజుకు 160 నుంచి 260 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత నెల 19 నుంచి ఈ నెల 1 వతేదీ వరకు కేవలం 3032 కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. కొవ్వూరు మండలంలో అత్యధికంగా 87 కేసులు నమోదు అవ్వగా వడవలూరు మండలంలో 75 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు ఆత్మకూరు రూరల్ గ్రామాలు, ముత్తుకూరు, కావలి రూరల్‌లో పాటు మరికొన్ని మండలాల్లో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తుంది.
nellore : గ్రామాల్లో అవగాహన అవసరం
కరోనా సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గుమఖం పట్టడంతో ప్రజలు విచ్చలవిడిగా బయటికి వస్తున్నారు. ఇప్పటికే మొదటి, సెకండ్ వేవ్‌ల ద్వారా చాలా నష్టపోయాం. ఇప్పుడు వైరస్‌ను అశ్రద్ధ చేస్తే మళ్లీ మూడో దశ వస్తుందని. తార్డ్ వేవ్ తీవ్రతరం చాలా ఎక్కువగా ఉంటుందిని. దాని ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మూడో దశ వజృంభించకముందే వైద్య ఆరోగ్య శాఖ తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుటేనే కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.