ChandraBabu : నరేంద్ర మోడీ, అమిత్ షా లకు ఎంత దగ్గరవ్వాలనుకున్న చంద్రబాబుకు పరాభవమే
ChandraBabu : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గర అయ్యేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కి ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. అయినా కూడా తమ ఓట్లను బీజేపీకి ఇచ్చి మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాని చంద్రబాబు నాయుడు ను మోడీ షా లు కనీసం పట్టించుకోవడం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా మద్దతును కోరుకుంటున్న బీజేపీ కనీసం తెలుగు దేశం పార్టీ వైపు చూడను కూడా చూడటం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థికి తెలుగు దేశం పార్టీ మద్దతు ఇవ్వడం కోసమే ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదు. కేవలం మోడీ షా ల తన వైపు చూస్తారేమో అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా గుసగసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎన్డీయే నుండి ఏమైనా ప్రపోజల్ వస్తే బేషరతుగా మద్దతు ప్రకటించేందుకు చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నాడని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆయన మద్దతు మీడియా కూడా ఎన్డీయే కూటమికి సంబంధించిన రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో చాలా పాజిటివ్ గా కథనాలు ఇవ్వడం జరిగింది.
రాష్ట్రపతి ఎన్నికల సమయంలో దేశంలో రాజకీయ సమీకరణాలు చాలా మారాయి. పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీల్లో ఉన్న వారు అధికార పార్టీ లోకి జంప్ లు అవుతున్నారు. ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు. ఇక్కడ స్పష్టంగా పరిస్థితి ఉంది. టీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తుంది అనే విషయంలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరో వైపు మోడీ షా లు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు అయిన వైకాపా మరియు టీఆర్‌ఎస్ ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాని తెలుగు దేశం పార్టీ ఓట్ల గురించి అస్సలు వారికి అక్కర్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.