TDP | పులివెందుల,ఒంటిమిట్టలో టీడీపీ ఘన విజయం.. ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారంటే..!
TDP | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 8,103 ఓట్లు పోలైతే.. మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడడంతో ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు.
ఘన విజయం

#image_title
ఇక కడప జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే పులివెందులలో తిరుగులేని విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీడీపీ… ఒంటిమిట్ట జడ్పీటీసీని కూడా కైవసం చేసుకోవడం విశేషం. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా… వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిపై 6,267 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
వైసీపీ అధినేత జగన్ గడ్డపై రెండు జడ్పీటీసీలను స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం.ఈ విజయంపై ఆ పార్టీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు బుద్ధి చెప్పాలనే ప్రజల ఆలోచనతో పాటు, టీడీపీ అమలు చేసిన పథకాలే పార్టీ విజయానికి కారణమయ్యాయని ఆయన అన్నారు.