Holi Festival : నకిరేకల్‌లో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Holi Festival : నకిరేకల్‌లో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

 Authored By prabhas | The Telugu News | Updated on :3 March 2026,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Holi Festival : నకిరేకల్‌లో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

Holi Festival : అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి సంతోషంగా జీవించాలనే ఐక్యతా భావాన్ని పంచే రంగుల పండుగ హోలీ సందర్భంగా నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ ఉత్సవాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రజలతో కలిసి ఆనందోత్సాహాలతో హోలీ పండుగను జరుపుకున్నారు. హోలీ పండుగ పురస్కరించుకుని నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని ఉత్సాహభరితంగా మార్చారు. రంగులు చల్లుకుంటూ, హర్షధ్వానాలతో ముందుకు సాగిన ఈ ర్యాలీ పట్టణమంతా పండుగ వాతావరణాన్ని సృష్టించింది.

MLA Vemula Veeresham participated in Holi celebrations in Nakrekal

Holi Festival : నకిరేకల్‌లో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజలకు హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ పండుగ మనలోని భేదాభిప్రాయాలను చెరిపేసి, ప్రేమ – స్నేహాలను మరింత బలపరచే పర్వదినమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రంగుల వసంతోత్సవం ప్రతి ఇంట ఆనందాన్ని నింపాలని, ప్రతి హృదయంలో స్నేహసౌభ్రాతృత్వాలు వికసించాలని ఆకాంక్షిస్తూ ప్రజలతో కలిసి రంగులు ఆడారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలసి సంబరాల్లో పాల్గొనడం విశేషం. మహిళలు, యువత, పిల్లలు సైతం భారీగా హాజరై వేడుకలకు మరింత కళతీశారు. నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన ఈ హోలీ సంబరాలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ప్రజల మధ్య సాన్నిహిత్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక ఈ వేడుకలు రంగుల హరివిల్లు లా పట్టణాన్ని ఆనందంతో ముంచెత్తాయి.

 

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది