tdp రాజకీయాలంటే ఎక్కువగా పురుష ఆధిపత్యం కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మహిళా అగ్రనేతలు చాలా తక్కువ అనే చెప్పాలి. పక్క రాష్ట్రము తమిళనాడు లో జయలలిత లాంటి పవర్ ఫుల్ నాయకురాలు ఉన్నట్లు మన రాష్ట్రాల్లో అలాంటి మహిళా నేతలెవరూ లేరనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రధాన పార్టీలైన వైస్సార్సీపీ, టీడీపీ లో చెప్పుకోదగిన మహిళా నేతలు అతి తక్కువ మందే ఉన్నారు..ఈ విషయంలో వైసీపీ కంటే టీడీపీ ఒక మెట్టు పైన ఉందనే చెప్పాలి.
వైసీపీ పార్టీ లో మహిళకు పెద్ద పీట వేస్తారనే టాక్ ఉంది. ఒక రకంగా అది నిజమే, దాదాపు 12 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.. వాళ్లలో మంత్రులు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో.. మహిళలకు కూడా పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారు. కానీ ఆ పార్టీ తరుపున మహిళా వాయిస్ పెద్దగా వినిపించదు . ఒక్క ఎమ్మెల్యే రోజా తప్పితే పెద్దగా మాట్లాడే నాయకురాళ్లు కనిపించరు. విడదల రజనీ, తానేటి వనిత, పాముల పుష్ప శ్రీవాణి లాంటి వాళ్ళు ఒకటి అరా సందర్భాల్లో మాట్లాడే వాళ్ళు తప్పితే ఏ రకంగానూ పార్టీకి కానీ, జగన్ కు కానీ ప్లస్ అయ్యే విధంగా మాట్లాడిన సందర్భాలు లేవు.
tdp మహిళకు సంబంధించి టీడీపీ tdp పార్టీలో “తెలుగు మహిళా” అనే స్పెషల్ వింగ్ ఒకటి ఉంది. వైసీపీ లో అలాంటిది ఏమి లేదు. ఇక ప్రతిపక్షములో ఉన్న టీడీపీకి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటానికి, సీఎం జగన్ కార్నర్ చేయటానికి పంచుమర్తి అనురాధ,తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు.. వంగలపూడి అనిత లాంటి వాళ్ళు దూకుడు చూపిస్తున్నారు. గతంలో నన్నపనేని రాజకుమారి, గల్లా అరుణ కుమారి లాంటి నాయకురాళ్లు ఉండేవాళ్ళు, ఆ తర్వాత కొన్నాలు దివ్యవాణి కూడా బలంగా వాయిస్ వినిపించింది. ప్రస్తుతం వంగలపూడి అనిత తన వాయిస్ గట్టిగా వినిపిస్తూ, టీడీపీకి అంతో ఇంతో ప్లస్ అవుతుందని చెప్పాలి.
పై రెండు పార్టీలో మహిళా నేతలు ఉంటున్న కానీ పార్టీ పరంగా మాట్లాడానికి ఎందుకో ముందుకు రావటం లేదు. వైసీపీ తరుపున 12 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒకరు, ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళు నామమాత్రంగానే ఉంటున్నారు. ఇక టీడీపీ తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని రెడ్డి సైతం పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.