విజయసాయి సస్పెన్స్‌ తో టీడీపీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారట

0
Advertisement

vijayasai reddy :వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో ”23వ తేదీ టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23కే టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ – చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో?” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ ఏంటా అంటూ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ నాయకుల నుండి మొదలుకుని ఇతర పార్టీల నాయకులు మరియు సామాన్య ప్రజలు ఇంకా వైకాపా వారు కూడా ఇంతకు ఆ రోజు ఏం జరుగబోతుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

vijayasai reddy : విజయ సాయి రెడ్డి ఉద్దేశ్యం ఏంటీ…

ఎంపీ విజయసాయి రెడ్డి ycp mp vijayasai reddy ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడును నానా రకాలుగా తిడుతూ విమర్శలు చేస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉంటాడు. కాని ఈసారి మాత్రం ఆయన ట్వీట్‌ ప్రత్యేకంగా ఉంది. రెండేళ్ల క్రితం తెలుగు దేశం పార్టీ అధికారం కోల్పోయింది.

ycp mp vijayasai reddy
ycp mp vijayasai reddy

సరిగ్గా అదే 23వ తారీకున ఏం జరుగుతుంది అంటూ నాయకులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి అంతకు మించిన దెబ్బ ఏమై ఉంటుందబ్బా అంటూ అంతా కూడా ఇప్పుడు జనాలు ఆలోచనలో పడ్డారు. ఇంతకు విజయ సాయి రెడ్డి ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు.

vijayasai reddy : ఎమ్మెల్యేల టెన్షన్‌..

ycp mp vijayasai reddy  ట్వీట్‌ తో ప్రస్తుతం చంద్రబాబు నాయుడులో ఆందోళన మొదలయ్యింది. ఆయన ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి వెళ్లారు. వారు మరికొందరితో కూడా టచ్ లో ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. పలువురు ఎమ్మెల్యేలను కేసుల భయంతో వైకాపా లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ వారి భయం. అందుకే ఆ రోజున మరి కొందరు వైకాపాలోకి తమ ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉంది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. విజయసాయ రెడ్డి ట్వీట్ కు అర్థం ఏంటీ అనేది తెలియాలంటే జులై 23 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Advertisement