Tirupati bypoll : ప్రచారానికి వెళ్లకుండా తిరుపతికి వంద కోట్లు పంపించిన జగన్? టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tirupati bypoll : ప్రచారానికి వెళ్లకుండా తిరుపతికి వంద కోట్లు పంపించిన జగన్? టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 April 2021,5:45 pm

Tirupati bypoll : ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఉపఎన్నిక గురించే చర్చ. ఈసారి ఎలాగైనా మేమే గెలుస్తాం అని అన్ని పార్టీలు కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నాయి. అయితే… తిరుపతిలో ప్రధాన పోటీ మాత్రం అధికార వైసీపీ, టీడీపీ మధ్యే. ఇప్పటికే ప్రచారాన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా మామూలుగా లేదు. విమర్శల స్థాయి కూడా దాటుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉపఎన్నికలో అధికారాన్ని ఉపయోగించి వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వార్డు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలకన్నా ఘోరంగా వ్యవహరిస్తున్నారని.. ఆయన ఆరోపించారు.

tdp leader devineni uma on tirupati by elections

tdp leader devineni uma on tirupati by elections

తిరుపతిలో ఇంత జరుగుతున్నా.. తాడేపల్లిలో కూర్చొని సీఎం జగన్ అంతా చూస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఇంత చేస్తున్నా ఎందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదంటూ దేవినేని మండిపడ్డారు. తిరుపతి ఓటర్లే సీఎం జగన్ కు బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ఏపీని బాగుచేయడం పక్కన పెట్టి.. సర్వనాశనం చేస్తున్నారు. నేను ప్రచారానికి రాను కానీ… వంద కోట్ల డబ్బు పంపిస్తామన్నారని సీఎం జగన్ పై దేవినేని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర్నుంచి… పెన్నా వరకు అన్నింటినీ తవ్వి పారేస్తున్నారన్నారు.

tdp leader devineni uma on tirupati by elections

tdp leader devineni uma on tirupati by elections

Tirupati bypoll : దళారుల కేంద్రాల్లా రైతు భరోసా కేంద్రాలు?

ఇక్కడ మాత్రం ఇసుక దొరకడం లేదు. ఇక్కడి ఇసుకను చెన్నైకి బెంగళూరుకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ప్రత్యేక హోదా ఏది? ఇసుక ఆన్ లైన్ ఏది? ఆఫ్ లైన్ ఏది? ఏదో చంద్రబాబు వల్ల ప్రస్తుతం అనంతపురం జిల్లాకు కనీసం కియా కార్ల పరిశ్రమ అయినా వచ్చింది. లేకపోతే అది కూడా వచ్చి ఉండేది కాదు. పోలవరం పనులు ఎందుకు ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఎంత మేరకు పనులు జరిగాయి. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే. చివరకు రైతు భరోసా కేంద్రాలను కూడా దళారుల కేంద్రాలుగా మార్చేశారు.. అని దేవినేని ఉమ మండిపడ్డారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది