Jr Ntr | జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని నేను తిట్ట‌లేదు.. టీడీపీ ఎమ్మెల్యే వివ‌ర‌ణ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr Ntr | జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని నేను తిట్ట‌లేదు.. టీడీపీ ఎమ్మెల్యే వివ‌ర‌ణ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :17 August 2025,1:00 pm

Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్‌‌‌పై పరుష పదజాలంతో మాట్లాడుతోన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న నేప‌థ్యంలో ఇది హాట్ టాపిక్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ వార్-2 సినిమా విడుదల సందర్భంగా తనను స్పెషల్ షోకు ఆహ్వానించిన అభిమానితో బూతులు మాట్లాడుతున్న వ్యక్తి.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడం ఆడియోలో వినిపిస్తోంది.

పార్టీకి కలిసిరాని వ్యక్తి సినిమాకు ఎలావెళ్తారు.. ఆ సినిమా వేస్తే కాల్చేస్తాను.. ఆ సినిమా రీల్ కూడా రాదు.. నా అనుమతి లేకుండా సినిమా ఎలా ప్రదర్శిస్తారు.. వాడితో డ్యాన్సులు చేస్తారా? మీరు.. సినిమా చూడండి మీకు అప్పుడు చెబుతాను.. సినిమాను ప్రదర్శిస్తే మధ్యలోనే కాల్చేస్తా.. వాడి సినిమా ఈ టైమ్‌లో ఎట్లా వేయిస్తారు.. ఆడించుకోండి చూద్దాం అంటూ అతడికి హెచ్చరించడం ఆడియాలో స్పష్టంగా వినిపిస్తోంది.

అయితే దీనిపై టీడీపీ ఎమ్మెల్యే వివ‌ర‌ణ ఇచ్చారు. ఇది త‌ను మాట్లాడింది కాద‌ని, నేనంటే గిట్ట‌ని వారు ఇలా ఫేక్ వీడియోల‌తో ప్ర‌చారం చేస్తున్నార‌ని, నాకు నారా, నంద‌మూరి కుటుంబాల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని అన్నారు ద‌గ్గుపాటి ప్ర‌సాద్

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది