TDP Politics : 10వ తరగతి విద్యార్థుల జీవితాలతోనూ టీడీపీ రాజకీయం
TDP Politics ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనకు రాజకీయ రంగు పులిమి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు .తాజాగా 10వ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం కూడా తెలుగు దేశం పార్టీ రాజకీయ రంగు పులమడంతో పదవ తరగతి విద్యార్థులకు గండం గా మారిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు అది పేపర్ లీకేజ్ కాదని.. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ ని బయటికి తీసుకొచ్చి లీక్ అయిన్నట్లుగా ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని తెలుగు దేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు.
పరీక్ష మొదలయ్యే ముందు పేపర్ బయటకు బయటకు వస్తే అది లీక్.. కాని పరీక్ష మొదలయ్యాక పేపర్ ను బయటకు తీసుకొచ్చి మీడియా ముందు పెడితే అది లీక్ అవుతుందా అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పట్లో పరీక్షలు వద్దంటూ కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు పరీక్షల పేపర్లు లీక్ విషయాన్ని రాద్దాంతం చేసి రాజకీయం చేసి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నారు. విద్యార్థుల విషయంలో మరియు వారి తల్లిదండ్రులకు తెలుగు దేశం పార్టీ ముసలి కన్నీరు కారుస్తూ వారికి మద్దతుగా ఉన్నట్లుగా నటిస్తుందన్నారు.
లీకేజీ వ్యవహారం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది అని బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పేపర్ లీకేజీ వ్యవహారం కచ్చితంగా విద్యార్థుల తదుపరి పరీక్షలపై ఉంటుందని, ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా తెలుగు దేశం పార్టీ రాజకీయం చేస్తుందంటూ మంత్రి ఆరోపించారు. పరీక్ష పేపర్ లీకేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగలేదని.. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య సెంటర్లకు పేపర్లను ఇస్తుందని.. సెంటర్ కి చేరుకున్న తరువాత అక్కడ నుండి పరీక్ష మొదలయ్యాక పేపర్లు బయటకు వస్తున్నాయని.. వాటిని తెలుగుదేశం పార్టీ నాయకులు తెపిస్తున్నారని మంత్రి ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా బొత్స విజ్ఞప్తి చేశారు.