Chandrababu : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండు దఫాలు సీఎంగా చేసిన కేసీఆర్ వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం బీజేపీతో పంచాయతీ పెట్టుకొని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుస్తున్నాడు. కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలతో కలుపుకుపోయేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు గతంలో కూడా చేశాడు కనుక ఇప్పుడు చేయడం కామన్ విషయమే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే ప్రధాని అభ్యర్థి కేసీఆర్ అంటూ ఆ పార్టీ నాయకులు కొందరు ప్రచారం మొదలు పెట్టారు.ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నేపథ్యంలో తన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దాంతో అతడు కేంద్ర రాజకీయాలపై ఆసక్తి గా లేడు అంటూ ఒక వర్గం టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రధాని అభ్యర్థి చంద్రబాబు నాయుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రి పోస్ట్ కి ఆఫర్ కూడా వచ్చింది అని ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో దానిని తిరస్కరించాడు.చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాలపై పట్టుకున్న వ్యక్తి , కానీ ఇప్పుడు సొంత రాష్ట్రంలో పరిస్థితి బాలేదు. కనుక కేంద్రంలో చక్రం తిప్పాలని ఆయన భావించడం లేదు.
మొదట తన పార్టీని మళ్లీ బలపర్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని బాబు పట్టుదలతో ఉన్నాడు. ఆ తర్వాత కేంద్రం పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కనీసం పార్లమెంటు స్థానాలు సాధించినట్లయితే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్ర రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దించేందుకు మోడీతో సన్నిహిత సంబంధాలను బాబు కోరుకుంటున్నారట. కనుక జాతీయ రాజకీయాలపై ఇప్పుడు ఆసక్తి చూపించక పోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.