Anil Ravipudi : రాజమౌళి తర్వాత అపజయం అనేది లేకుండా వరుస సినిమాలు చేస్తున్న దర్శకుడు అనీల్ రావిపూడి. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ .. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ఆడాయి. తాజాగా ఈ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఇందులో ఎన్టీఆర్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ‘పటాస్ పూర్తయ్యే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కువగా ఆఫీస్‌కు వస్తుండేవారు.
ఆయన నన్ను మామూలుగా ఆడుకునేవారు కాదు.రోజూ ర్యాగింగ్ చేసేవారు. ర్యాగింగ్ అంటే బాధపెట్టడం కాదు, అల్లరి చేసేవాళ్లు, జోక్ చేసేవాళ్లు.నాకు కథ చెప్పవా? అని అడిగేవారు. నా మొదటి సినిమానే ఇంకా రిలీజ్ కాదు, ఏం చెప్పాలి అని నేనంటే.. అయితే నాకు కథ చెప్పవా? అని సరదాగా ఆడేసుకునేవాళ్లు. అవి నేను మర్చిపోలేని జ్ఞాపకాలు’ అని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈయన వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలిసి ఎఫ్ 3 అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.ఎఫ్ 2 సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే.
అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఏప్రిల్ 28న సినిమా విడుదల కానున్నట్టు సమాచారం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.