Chandrababu : అసలైన టీడీపీ వారసుడు ఎవరు? చంద్రబాబును సొంత పార్టీ నేతలే ఎందుకు నమ్మడం లేదు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : అసలైన టీడీపీ వారసుడు ఎవరు? చంద్రబాబును సొంత పార్టీ నేతలే ఎందుకు నమ్మడం లేదు?

 Authored By sukanya | The Telugu News | Updated on :29 July 2021,4:07 pm

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ఆయన నాయకత్వంపై నమ్మకాలు చెదిరిపోతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చంద్రబాబు ఇంతటి క్రైసిస్ ను ఎదుర్కొనలేదు. ఒకవైపు జగన్ మరోవైపు సొంత పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రకంపనలు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఎలా అధిగమించాలో చంద్రబాబుకు అర్థం కాకుండా ఉంది. ఒక చోట కాదు చంద్రబాబు వెళ్లిన ప్రతి చోటా జూనియర్ ఎన్టీఆర్ రావాలని నినాదాలు వినపడుతున్నాయి. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికలకు సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రకటించాలన్నది క్యాడర్ నినాదంగా ఉంది. అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా క్యాడర్ అంగీకరించడం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తెలియని దెబ్బ తగులుతుందనడం వాస్తవం. దీనిపై ఊరుకుంటే, భవిష్యత్ లో పెను ముప్పు తప్పదన్నది విశ్లేషకుల అంచనా.

tdp president chandrababu naidu fear on his party

tdp president chandrababu naidu fear on his party

రానంటున్నా..

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి రాబోనని చెప్పేశారు. అయినా ఆయన అభిమానులు, టీడీపీ క్యాడర్ మాత్రం రావాల్సిందేనంటున్నారు.. తెలుగుదేశం పార్టీని కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాపాడగలడన్న విశ్వాసాన్ని క్యాడర్ వ్యక్తం చేస్తుంది. ఇక గోరంట్ల వంటి సీనియర్ నేతలు సైతం జూనియర్ ఎన్టీయార్ రావాలని, వస్తేనే, పార్టీ మనుగడ ఉంటుందని బహిరంగంగానే వెల్లడించారు. ఇక కార్యకర్తలైతే, బహిరంగంగానే తమ అభిప్రాయాల్ని నినాదాలు, ఫ్లకార్డులతో ప్రకటిస్తున్నారు. దీంతో జూనియర్ ఎన్టీయార్ రానంటున్నా, కార్యకర్తలు మరింతగా ఒత్తిడి చేస్తే, రావచ్చన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఇది చంద్రబాబుకు రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందికరంగా మారింది. తనకు రాజకీయ వారసుడిగా లోకేష్ ఉండాలని భావిస్తోన్న బాబుకు ఈ నినాదాలు కంటగింపుగా మారాయి. దీనిపై ఎక్కడా ఏమీ మాట్లాడకపోయినా, జూనియర్ ఎన్టీయార్ రాక ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికలకు మూడేళ్ల ముందే జూనియర్ నినాదం ఇలా విన్పిస్తుంటే, ఇక ఎన్నికల సమాయానికి రీసౌండ్ మరింత పెరుగుతుందని, అప్పుడు ఎలా ఎదుర్కొంటారోనన్న ప్రశ్న కేడర్ లో వినిపిస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది