TDP : టీడీపీకి ఈసారి సింగిల్ డిజిట్ పక్కా.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : టీడీపీకి ఈసారి సింగిల్ డిజిట్ పక్కా.!

TDP : ఆంధ్రప్రదేశ్‌లో తామే అధికారంలోకి వస్తామంటోంది తెలుగుదేశం పార్టీ, 2024 ఎన్నికలపై టీడీపీ చాలా ఆశలే పెట్టుకుందిగానీ, ఆ పార్టీకి సరైన అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి 2024 ఎన్నికల్లో వుండకపోవచ్చు. వాస్తవానికి, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్లు దక్కించుకున్న కొందరు నేతలు, చివరి నిమిషంలో వైసీపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే. ఆ లెక్కన వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వైసీపీకి సింగిల్ డిజిట్ సీట్లు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 July 2022,8:20 am

TDP : ఆంధ్రప్రదేశ్‌లో తామే అధికారంలోకి వస్తామంటోంది తెలుగుదేశం పార్టీ, 2024 ఎన్నికలపై టీడీపీ చాలా ఆశలే పెట్టుకుందిగానీ, ఆ పార్టీకి సరైన అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి 2024 ఎన్నికల్లో వుండకపోవచ్చు. వాస్తవానికి, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్లు దక్కించుకున్న కొందరు నేతలు, చివరి నిమిషంలో వైసీపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే. ఆ లెక్కన వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వైసీపీకి సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయంటూ టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

అయితే, వైసీపీ మాత్రం తాము 175 సీట్లలోనూ గెలిచి తీరతామంటోంది. కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ధీమాగా చెబుతున్నారు. ఇంతకీ, 2019 ఎన్నికల్లో ఏం జరగబోతోంది.? ప్రస్తుతం వినిపిస్తున్న రాజకీయ విశ్లేషణల ప్రకారం చూస్తే, టీడీపీ 2024 ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించే అవకాశం లేదట. సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితమవుతుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

TDP To Get Single Digit This Time

TDP To Get Single Digit This Time

ఈ విషయమై టీడీపీ వర్గాల్లోనూ ఒకింత గుబులు రేగుతున్నా, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. కింది స్థాయిలో పరిస్థితులు ఎలా వున్నాయో తెలుసుకోలేనంత అమాయకులు టీడీపీలో వున్నారా.? అధినేత దగ్గర్నుంచి, అందరికీ అన్ని విషయాలపైనా అవగాహన వుంది. ఇక్కడ చిత్రమేంటంటే, టీడీపీ కంటే జనసేన పార్టీకి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం వుండడం. కాస్త కష్టపడితే, టీడీపీ నీడ పడకుండా చూసుకోగలిగితే, జనసేన డబుల్ డిజిట్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది