Telangana BJP యువనేతలు ఎదగాలంటే సరైన సందర్భాలు కావాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. తెలంగాణ బిజెపి యువనేతలకు సంజయ్ యాత్ర రూపంలో ఓ ఛాన్స్ వచ్చింది. తమ టాలెంట్ రుజువు చేసుకోటానికి శాయశక్తులా కష్టపడుతున్నారట. పాదయాత్ర చేస్తున్న సంజయ్ టార్గెట్ ఒకటైతే, వారసుల టార్గెట్ మరొకటిగా మారింది. సంజయ్ సంగ్రామ యాత్రలో నేతల వారసులు హడావుడి చేస్తున్నారు. పనిలో పనిగా కమలం పార్టీలో తమ భవిష్యత్ కి గట్టి పునాదులు వేసుకుంటున్నారు. పాదయాత్ర వేదికగా తమ ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు టార్గెట్ గా పెట్టుకుని కష్టపడుతున్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర లో ఎక్కువగా యువత కనిపిస్తోంది. పార్టీ కి చెందిన యువ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో భాగం అవుతున్నారు. పాదయాత్ర ఏర్పాట్ల కోసం వేసిన కమిటీల్లోనూ యువనేతలకు ఎక్కువగా చోటు కల్పించారు. ఈ కమిటీ ల్లో పార్టీ నేతల వారసులకు ఎక్కువగా స్థానం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వారసులు కష్ట పడుతున్నారు. పాద యాత్రలోనే ఎక్కువ సమయం ఉంటున్నారు.
ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు. సంజయ్ సంగ్రామ యాత్ర కు సహా ఇంచార్జ్ గా ఉన్నారు. ఈ యాత్ర లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా సంజయ్ యాత్రలో పాల్గొంటున్నారు. ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ గ్రేటర్ ఎన్నికల సమయం లో బీజేపీలో చేరారు. పాదయాత్ర సందర్భంగా ఆయనకు కూడా బాధ్యత అప్పగించారు. జన సమీకరణ విభాగంలో ఆయన ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి సంగ్రామ యాత్రలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
మిథున్ రెడ్డి కూడా సంజయ్ వెంటే ఉంటున్నారు. ప్రచార రథాల విభాగంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు కూడా సంజయ్ పాద యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. సంజయ్ వెంట రెగ్యులర్ గా ఉంటున్నాడు. తన టీమ్ తో హడావుడి చేస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ సంజయ్ పాద యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. బల ప్రదర్శన చేసుకుంటున్నారు. వాహన శ్రేణి విభాగం లో బాధ్యతలు చూస్తూ సంజయ్ వెంటే ఉంటున్నారు..
ఈ వారసులంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్నారట. రాజకీయంగా బల పడేందుకు, పార్టీలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట, సంజయ్ సంగ్రామ యాత్ర వారసులకు ఇలా ఉపయోగపడుతోందనే టాక్ నడుస్తోంది. దీంతో పాదయాత్ర సాక్షిగా, సామర్థ్యం నిరూపించుకునే వారసులెవరో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో బరిలో నిలిచే అవకాశం ఎవరికి వస్తుందో అనే ఆసక్తి ఏర్పడింది
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.