Jabardasth Comedians: జబర్దస్త్ కమెడియన్స్ గా బయట ఉన్న గుర్తింపు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరూ సినిమాలలో నటిస్తున్న పాపులర్ కమెడియన్స్‌కు ఉన్న రేంజ్ మార్కెట్ కూడా సంపాదించుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ లాంటి వాళ్ళు ఇప్పుడు బుల్లితెరను ఏలుతున్నారని చెప్పక తప్పదు. వీరి సంపాదన ఇప్పుడు నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నారు. ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్స్ ఎంతవరకు చదువుకున్నారు. ఎవరు ఎక్కువ చదువుకున్నారు..అనేది అపుడప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
నిజంగా ఎవరు ఎక్కువ చదువుకున్నారనేది ఓసారి పరిశీలిస్తే..హైపర్ ఆది బి టెక్ చదివాడు. ఇతను హైదరాబాద్‌లో ఓ ఎం.ఎన్.సి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ జబర్దస్త్‌కి వచ్చి పాపులర్ అయ్యాడు. ఇక ఆదిని జబర్దస్త్ కి తీసుకు వచ్చిన అదిరే కూడా అభి బి టెక్ చేశాడు. యాంకర్ రష్మీ తో 9 ఏళ్ళుగా స్కిట్స్ చేస్తూ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ డెవలప్ చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇంటర్మీడియట్ తో ఆపేశాడు. కానీ సుధీర్ ని చూస్తే ఎవరైనా బాగా చదువుకున్నాడని అనుకుంటారు.
ఈ మధ్య బాగా పాపులర్ అయిన కమెడియన్ ఇమ్మాన్యుయేల్. సీరియల్ నటి వర్షతో ఇతను చేస్తున్న స్కిట్స్ బాగా పేలుతున్నాయి. అయితే ఇమ్మాన్యుయేల్ ని చూసిన ఎవరైనా అసలు చదువుకున్నాడా అని అనుమానిస్తారు. కానీ ఇమ్మాన్యుయేల్ డిగ్రీ పూర్తి చేశాడు. స్కిట్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను చూపిస్తున్న రాకెట్ రాఘవ డిగ్రీ (టీచర్ ట్రైనింగ్) చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ తో జబర్దస్త్ లో పాపులర్ కమెడియన్ గా మారాడు. సుకుమార్ దర్శకత్వంలో రాం చరణ్ – సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమాలో చరణ్ పక్కనే ఉండే మంచి పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నాడు మహేష్. మహేష్ కి రంగస్థలం మహేష్ అని కూడా పేరుంది. ఇతను డిగ్రీ (బి కామ్) పూర్తి చేశాడు.
అలాగే మిగతా కమెడియన్స్ అయిన అదుర్స్ ఆనంద్: ఎంసిఏ డిస్ కంటిన్యూ
ముక్కు అవినాష్: ఎంబిఏ
కెవ్వు కార్తిక్: డిగ్రీ
గెటప్ శ్రీను: ఇంటర్మీడియట్ డిస్ కంటిన్యూ
రామ్ ప్రసాద్: ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
చలాకీ చంటి: డిగ్రీ డిస్ కంటిన్యూ
చమ్మక్ చంద్ర: ఇంటర్మీడియట్
సునామీ సుధాకర్: డిగ్రీ
తాగుబోతు రమేష్: స్కూలింగ్ కంప్లీటెడ్
బుల్లెట్ భాస్కర్: బి కామ్
నాటీ నరేష్: డిగ్రీ డిస్ కంటిన్యూ చేశారు. ఇక అందాల యాంకర్స్ లో యాంకర్ రష్మి గౌతమ్ వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.అలాగే బుల్లితెరమీద, సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటుతూ, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ ఎంబిఏ పూర్తి చేసింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.